Phone Tapping: తెలంగాణలో దుమారం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్.. కేంద్రం కీలక నిర్ణయం

Phone Tapping: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం మొన్నటివరకు తెలంగాణ రాజకీయాలను కుదిపేయగా.. అది మరువకముందే ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ టీ పాలిటిక్స్‌లో దుమారం సృష్టిస్తోంది. ప్రత్యర్ధి పార్టీల నేతల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే కోర్టులలో పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి.

 

రాజ్ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గవర్నర్.. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ గురించే మాట్లాడారు. తన ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్లు అనుమానం కలుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో తనను కూడా లాగేందుకు ప్రయత్నాలు చేశారంటూ తమిళి సై చెప్పారు. రాజ్ భవన్ నుంచే అదంతా నడిచినట్లు ఆరోపణలు చేశారని, తుషార్ అనే వ్యక్తి తనకు సన్నిహితుడంటూ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారని గవర్నర్ అన్నారు. తుషార్ తన దగ్గర ఏడీసీగా పనిచేశారని, దీపావళి సందర్భంగా విష్ చేయడానికి రాజ్ భవన్ కు వచ్చారన్నారు.

 

ఏకంగా గవర్నర్ తన ఫొన్ ట్యాప్ అయిందంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోన్నాయి. ఈ క్రమంలో దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ సంస్ధలతో సీక్రెట్ గా విచారణ చేయిస్తోందని చెబుతున్నారు. ఇది నిజమేనా.. లేదా అనే వ్యవహారంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రహస్యంగా విచారణ చేయిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ నిజమని తేలితే చర్యలు తీసుకునే అవకాశముందని అంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితుల కాల్ రికార్డులన్నీ లీక్ కావడంతో పాటు బీజేపీ నేతల కాల్ రికార్డులు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో ప్రభుత్వం బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆ పార్టీ ఆరోపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పార్టీ నిర్వహణ అవసరాల కోసం 10 కోట్ల రూపాయలు ప్రకటించిన పవన్.. గ్రేట్ కదా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ అవసరాల కోసం పెద్ద ఎత్తున తన సొంత డబ్బును ఖర్చు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా ఎవరైనా...
- Advertisement -
- Advertisement -