Chahal: స్పిన్నర్‌గా చహల్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే..

Chahal: టీమిండియా స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యజేంద్ర చహల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన స్పినర్ గా ఘనత సాధించాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చహల్ ఈ రికార్డు సాధించాడు. ఏడో ఓవర్ లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ ఫీట్ అందుకున్నాడు.

ఐపీఎల్ లో ఇప్పటివరకు 170 వికెట్లు చహల్ తీసి స్పిన్నర్ల జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. ఇక అమిత్ మిశ్రా 167 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా.. పీయూష్ చావ్లా 157 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 157 వికెట్లతో నాలుగో స్థానంలో, సునీల్ నరైన్ 153 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక టీ20లలో లీగ్ లు, ఇంటర్నేషనల్ మ్యాచ్ లు కలిపి చహల్ 300 వికెట్లు పడగొట్టాడు.

 

ఇక ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చహల్ నాలుగు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో 72 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. తొలుత రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కు దిగగా.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసేింది. ఆర్ఆర్ తరపున బట్లర్, సంజూ శాంసన్, జైశ్వాల్ హాఫ్ పెంచరీలు చేయడంతో భారీ స్కోరు చేసింది. సన్ రైజర్ హైదరాబాద్ జట్టులో అబ్ధుల్ సమద్ 32 పరుగులు, ఉమ్రాన్ మాలిక్ 19 పరుగులు చేశారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు మార్చిన చంద్రబాబు.. కొత్త పేరు ఏంటో తెలుసా?

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాగళం పేరిట ఈయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అధికార ప్రభుత్వంపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -