Chandra Hass: అతి చేష్టలతో పరువు పోగొట్టుకున్న చంద్రహాస్.. ఏమైందంటే?

Chandra Hass: ప్రభాకర్.. తన నటన అభినయంతో తెలుగింట ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. నటనతో పాటు, నిర్మాతగా కూడా మంచి విజయాలు సాధించారు ప్రభాకర్ గారు. ఇక ప్రస్తుతం వరుస సీరియల్ ఆఫర్స్ తో బిజీబిజీగా మారిపోయారు. ఇక అప్పుడప్పుడు సినిమాలకు కూడా ఒప్పుకుంటూ ఆ పాత్రల ద్వారా కూడా మంచి పేరు తెచుకున్నాడు.

ఇక ఇటీవల ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ట్రోల్స్ పై ప్రభాకర్ స్పందిస్తూ.. ట్రోల్స్ వల్ల కూడా మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు. తన కొడుకుపై ట్రోల్స్ రావడం వల్లే బాగా పాపులర్ అయ్యాడని ప్రభాకర్ చెప్పుకొచ్చారు కూడా. ఇక ఇటీవల చంద్రహాస్ చేసిన పనులకు నెటిజెన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయ్యప్ప మాలలో ఉన్న చంద్రహాస్..
అయ్యప్పస్వామి మాల వేసుకున్న చంద్రహాస్.. పద్దతి పాడు లేకుండా ఫోజుల్లో ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసాడు. దీనిపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రహాస్ తన ప్రవర్తనను మార్చుకోవాలని, ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. తన ఆటిట్యూడ్ ను మార్చుకోకపోతే చంద్రహాస్ కెరీర్ లో కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తున్నారు.

చంద్రహాస్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్ని విషయాల్లో చంద్రహాస్ పద్ధతి మార్చుకుంటే తన కెరీర్ కు కలిసి వస్తుందని సూచిస్తున్నారు. చంద్రహాస్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తను హుందాగా వ్యవహరించాలని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -