Chandrababu: 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్.. బాబు హామీకి తిరుగులేదుగా!

Chandrababu: మరొక రెండు వారాలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీల వారు ఎన్నికల హామీలను ప్రకటిస్తూ మేనిఫెస్టో కూడా విడుదల చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల ముందు విడుదల చేసినటువంటి నవరత్నాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ఇకపోతే కూటమి తరపున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈయన మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు నిజంగానే సూపర్ గా ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50 సంవత్సరాలు దాటగానే నాలుగువేల రూపాయలతో ప్రతినెల పెన్షన్ ఇంటి వద్దకు తీసుకువచ్చేలా ప్రకటించారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిర్మాణ పనులు అన్నింటిని కూడా పూర్తి చేస్తున్నట్లు ప్రకటించారు.

డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలను 10 లక్షల రూపాయల వరకు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక మనం మన ఆరోగ్యం కోసం రూపాయి రూపాయి కూడా పెట్టే పని లేకుండా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా ప్రకటించడమే కాకుండా షుగర్ బీపీ వంటి వ్యాధులతో బాధపడే వారికి ఉచితంగా మందులను కూడా అందజేయబోతున్నట్లు ఈ మేనిఫెస్టోలో వెల్లడించారు.

ఇక చంద్రబాబు నాయుడు తన విజన్ తో ఈ మేనిఫెస్టో రూపొందించారని స్పష్టంగా తెలుస్తోంది ప్రస్తుత ప్రజల అవసరాలను తీరుస్తూ భవిష్యత్తు తరాల బంగారు భవిత కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే బాధ్యత చంద్రబాబు నాయుడు కూటమి తీసుకోబోతుందని తెలుస్తోంది. ఈ విధంగా అద్భుతమైనటువంటి పథకాలను తీసుకువస్తూ చంద్రబాబు నాయుడు వెల్లడించినటువంటి ఈ మేనిఫెస్టో ఆయన విజయానికి తిరుగు లేదని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -