Chandrababu: లోకేశ్ పాదయాత్రకు బిగ్ ప్లాన్.. ఏకంగా వారిని రంగంలోకి దించనున్న చంద్రబాబు

Chandrababu: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు భారీ ప్లాన్ చేస్తున్నారు. జనవరి నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశముంది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ప్రారంభం కానున్న లోకేష్ పాదయాత్ర.. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు జరగనుంది. జనవరి 26న లోకేశ్ పాదయాత్రను ప్రారంభించే విధంగా టీడీపీ వర్గాలు ప్లాన్ చేశాయి. దాదాపు 450 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుండగా.. దాదాపు 100 నియోజకవర్గాలు టచ్ చేసేలా లోకేశ్ పాదయాత్ర సాగనుంది.

3800 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, షర్మిల, జగన్ రికార్డులను బద్దలు కొట్టేలా లోకేష్ పాదయాత్ర ఉండనుంది. అయితే లోకేష్ పాదయాత్రను సక్సెస్ చేసేందుకు చంద్రబాబు ఇప్పటినుంచే రంగంలోకి దిగనున్నారు. దసరా తర్వాత లోకేశ్ పాదయాత్ర కోసం పార్టీ నేతలను, కార్యకర్తలను సన్నద్దం చేయనున్నారు. దీని కోసం పార్టీ వీరాభిమానులతో భేటీ కానున్నారు. ఎప్పటినుంచో పార్టీలో ఉన్న క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటున్న కార్యకర్తలను మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడనున్నారు. ప్రతి నియోజవకర్గం నుంచి వంది మంది కార్యకర్తలతో భేటీ కానున్నారు.

లోకేష్ పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో ఈ వంద మంది వెంట ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ వందమంది కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులను కూడా భాగస్వామ్యులు చేయబోతున్నారు. ఆయా నియోజకవర్గాలోనే వారికి వసతి,భోజన ఏర్పాట్లు చేసేలా స్ధానిక నేతలకు బాధ్యతలు అప్పగించను్నారు. లోకేష్ తో పాటు వీరందరూ కలిసి పాదయాత్ర చేసేలా చర్యలు చేపట్టనున్నారు. దీని వల్ల లోకేష్ పాదయాత్రపై మీడియా ఫోకస్ ఉంటుందని భావిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభం సమయంలో మీడియా ఫోకస్ మొత్తం ఉంటుంది.

కానీ 450 రోజులు మీడియా ఫోకస్ ఉండదు. అందుకే పాదయాత్రకు 450 రోజులు మీడియా ఫోకస్ ఉండేలా చర్యలు తీసుకోను్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి లోకేష్ పాదయాత్ర ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే వైసీీప ప్రభుత్వంపై వ్యతిరేక పెరుగుతుుందని చంద్రబాబు భావిస్తు్నారు. లోకేష్ పాదయాత్ర ద్వారా టీడీపీ మైలేజ్ మరింత పెరుగుతందని చెబుతు్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: ఓటమి భయంతో జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా.. ఈ ప్లాన్స్ కు అడ్డుకట్ట వేసేదెవరు?

YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వార్ వ‌న్‌సైడ్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూట‌మికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -