Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం మెగా డీఎస్సీ పైన అని, రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన ఉంటుందని చెప్పారు. మెగా డీఎస్సీ మీద సంతకం పెట్టడం వలన 20 వేల మంది నిరుద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన సంతకం పెట్టడం వలన రైతులు మధ్యతరగతి ప్రజలు మహిళలు ధైర్యంగా ఉంటారని చెప్పారు చంద్రబాబు. ఇంకా ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ఇసుకని కూడా వదలకుండా దోచుకున్నాడు, ట్రాక్టర్ ఇసుక ధరను 5000 పెంచేసాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగానే ఇస్తాం అని హామీ ఇచ్చారు. కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో అదిరిపోయే హామీలు ఇచ్చాము.

ఇది చూసిన జగన్ రెండు టీవీలు పగలగొట్టాడంట. రాజధాని పేరు కూడా చెప్పలేని దౌర్భాగ్యం తెచ్చాడు అని జగన్ పై విరుచుకుపడ్డారు చంద్రబాబు. జగన్ కి డ్రైవింగ్ ఎలా చేయాలో తెలియక రాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో వెనక్కి తీసుకు వెళ్ళాడని, నేను అధికారంలోకి వస్తే డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తాను అని హామీ ఇచ్చారు.

మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేస్తాము అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తాం అన్నారు. ప్రజల బలహీనత మీద సొమ్ము చేసుకున్నాడు జగన్. క్వార్టర్ 65 రూపాయలు ఉన్న మద్యం ధర నేడు 200 రూపాయలకి పెరిగింది. నాసిరకం మద్యంతో 30 వేల మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెంచేశాడు. మేము అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గించడమే కాకుండా నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తాం అని చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -