Chandrababu: జగన్ దెబ్బకు చంద్రబాబు నాయుడు సైలెంట్.. ఏం జరిగిందంటే?

Chandrababu: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరిగే విషయం గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయి అంటూ గత కొద్దిగా వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్నికల గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన వచ్చే ఏడాది ఏప్రిల్ లోనే ఎన్నికలు జరగబోతున్నాయి అంటూ కామెంట్ చేశారు.అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తప్పకుండా గెలవాలని ఈయన ఆకాంక్షించారు. పార్టీని గెలిపించాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని తెలియజేశారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా టీడీపీకి దేశంలోనే ఎంతో పేరుందన్నారు. ఇలాంటి పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకర పాలను అంతం చేయాలని ఈయన తెలియజేశారు.

 

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాదులో ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. అయితే తన తర్వాత సీఎం అయిన వారందరూ కూడా అభివృద్ధి పనులను కొనసాగించటం వల్లనేడు హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని తెలియజేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా కాదని తాను చేపట్టిన నిర్మాణ పనులను కూడా జగన్మోహన్ రెడ్డి కూల్చివేశారు అంటూ వెల్లడించారు.

 

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడం కోసం తాను అమరావతిని రాజధానిగా ప్రకటించాను. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం మూడు రాజధానుల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఇక అమరావతిని కనుక అభివృద్ధి చేసి ఉంటే నేడు లక్ష కోట్ల సంపద సృష్టించే వాళ్ళమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా నేతలు కార్యకర్తలు కృషి చేయాలని అందరూ సమిష్టిగా కలిసి పని చేయాలని ఈయన తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -