Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు ఊతమిచ్చేలాగా కనిపిస్తుంది. జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వ్ చేసి జగన్ ఫొటోలతో కూడిన డాక్యుమెంట్లను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా ఒక పెద్ద మాఫియా అని, భూములకు సంబంధించి సరిహద్దు రాళ్ళ వ్యవహారం కూడా పెద్ద కుంభకోణమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజల భూముల ఒరిజినల్ పత్రాలను ప్రభుత్వం దగ్గర పెట్టుకొని నకిలీ పత్రాలను రైతులకు ఇస్తామనటంతో రైతులలో భయం మొదలైంది. రైతుల పొలాల వద్ద, పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు పెట్టుకుంటున్నారని ఇప్పటికే రైతన్నలందరూ గగ్గోలు పెడుతున్నారు. నిజానికి వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు పేరుతో సరిహద్దురాళ్ళను పెద్ద ఎత్తున తయారు చేయించి పాతేస్తున్నారు.

అయితే ఆ రాళ్లకి అవుతున్న ఖర్చు ఎంత, ప్రభుత్వం మారినప్పుడు ఆ రాళ్ళను తీసేసి వేరే రాళ్లని పెడితే దానికి అయ్యే ఖర్చు ఎంత,అసలు ఇంత ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అనే అనుమానాలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. భూముల హక్కుదారులైన వారి దగ్గర ఒరిజినల్ పత్రాలు ఉండకుండా ప్రభుత్వం దగ్గర ఉంచాలి అనటం రైతులకు మింగుడు పడటం లేదు. ఈ వ్యవహారంపై న్యాయ నిపుణులు కూడా చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ఎన్నికల సమయం సమీపిస్తూ ఉండడంతో ప్రత్యర్థులు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంపై అనేక రకాలుగా ప్రజలకి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ యాక్ట్ అమల్లోకి వచ్చినట్లు ఓ జీవో ద్వారా బయటపడటంతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ రచ్చబండ దగ్గర చూసిన ఈ ల్యాండ్ టైటిల్ ఆక్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -