Chandrababu: జగన్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చంద్రబాబు ప్లానింగ్.. ఏమైందంటే?

Chandrababu: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా పొత్తుల కోసం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ తలుపు తిట్టడంతో అసలైన వేడి ఇప్పుడు మొదలైంది. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్నప్పటికీ ఇప్పుడే ఒక విడత మేనిఫెస్టో కూడా విడుదల చేసేసి తొందరపడుతున్న చంద్రబాబు నాయుడు. పొత్తులను కూడా వీలైనంత త్వరగా ఖరారు చేసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ సయోధ్య కుదుర్చుకునేలాగా అమిత్ షా, నడ్డాలతో ఆయన భేటీ అయినట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వ్యవహార సరళి, వ్యూహరచనా సామర్థ్యం తెలిసిన కొందరు చేస్తున్న విశ్లేషణ ఇంకోలా ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెప్పులోని రాయి లాగా మారిన సొంత ఎంపీ రఘురామ కృష్ణంరాజు ద్వారా ఒక మాస్టర్ గేమ్ ప్లాన్ నడిపించాలని బాబు అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. రఘురామకృష్ణరాజు తనను ఎంపీని చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని అప్రతిష్ట పాలు చేయడానికి కోవర్ట్ లాగా పని చేయడం ప్రారంభించిన తర్వాత, చంద్రబాబు నాయుడుని కీర్తించడం తన దైనందిన విధిలాగా నిర్దేశించుకున్నారు.

 

జగన్ ని ఎద్దేవా చేస్తూ వీడియోలు విడుదల చేయడం, విలేకరుల సమావేశాలు పెట్టడం, పనిలో పనిగా చంద్రబాబు భజన చేయడం, కొన్ని సంవత్సరాలుగా రఘురామకృష్ణ రాజు చేస్తున్న పని ఇదే. ఇందుకు ఆయన రుణం చెల్లించుకోవడానికి చంద్రబాబు ఒక పెద్ద ఎత్తుగడ వేశారు. ఇప్పటిదాకా రఘురామకృష్ణరాజు వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీలో ఉంటారనే స్పష్టత రాలేదు. అటు భారతీయ జనతా పార్టీ కీలక నాయకులతో కూడా ఆయన చాలా సన్నిహితంగా మెలగుతుంటారు. ఆయన తెలుగుదేశంలో చేరుతారా, కమల తీర్థం పుచ్చుకుంటారా అనే విషయంలో ఇప్పటిదాకా సంకేతాలు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు తాజాగా అమిత్ షా తో భేటీ కోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు రఘురామకృష్ణ రాజు విమానాశ్రయానికి వచ్చి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో కలిసి తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి వెళ్లారు. అలా వారితోనే ఎక్కువ సమయం గడిపారు. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని చంద్రబాబు మాస్టర్ గేమ్ ప్లాన్ వ్యూహరచన చేసినట్లుగా కనిపిస్తుంది. అదేంటంటే తన పరిచయాలను వాడుకొని రఘురామకృష్ణరాజు బిజెపి తీర్థం పుచ్చుకుంటారు. పొత్తులలో భాగంగా ఆయన గతంలో వైఎస్ఆర్సిపి నుంచి గెలిచిన నియోజకవర్గం నరసాపురంను తెలుగుదేశం పార్టీ బిజెపికి కేటాయిస్తుంది. అక్కడి నుంచి తిరిగి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారు. మొత్తానికి వచ్చే ఎన్నికలలో ఎలా అయినా గెలవడానికి బాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -