Chanukyudu: పీకల్లోతు కష్టాలు ఉన్నాయా.. అయితే చాణక్యుడు ఏం చెప్పాడంటే?

Chanukyudu: మాములుగా కష్టాలు అనేవి ఎవరికైనా ఉంటాయి. ఇక కొందరు ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటే మరికొందరు ఆ కష్టానికి భయపడి మరింత కష్టాన్ని తెచ్చుకుంటారు. అయితే పీకల్లోతు కష్టాలు ఉన్నవారు ఆ కష్టాల నుండి బయటపడటానికి కొన్ని విధాలుగా ఉంటే కచ్చితంగా ఆ సమస్యకు దూరం కావచ్చు అని చాణక్యుడు తెలిపాడు.

 

ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప పండితుడు. ఇక ఈయన చెప్పే విధానాలు మాత్రం అందరి దృష్టిని ఆకట్టుకుంటాయి. ఇప్పటికీ ఈయన ఎన్నో సూత్రాలను ప్రజలకు అందజేశాడు. ఈ తరం ప్రజలు కూడా ఈయన విధానాలను అనుసరిస్తూ ఉంటారు. అయితే పీకల్లోతు కష్టాలు ఉన్నవారికి కూడా తన విధానాల ద్వారా ధైర్యం ఇచ్చాడు ఆచార్యుడు. ఇంతకు అవేంటో తెలుసుకుందాం.

 

ముఖ్యంగా ప్రతి వ్యక్తికి ధైర్యం అనేది చాలా అవసరం. ధైర్యంగా ఉంటే కష్టాన్ని దృఢంగా ఎదుర్కోగలరు. చెడు సమయాల్లో కూడా ధైర్యం, సొంత నియంత్రణను కొనసాగించాలి. ఆ సమయాలలోనే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక చెడు సమయాలు వచ్చినప్పుడు మనం చేసే ప్రతి పని తప్పుగా మారుతుంది. కాబట్టి ఆ సమయంలో తొందరపడకుండా ఓపిక పట్టాలి.

 

ముఖ్యంగా భయపడకూడదు. భయపడితే మాత్రం విజయం సాధించడం కష్టం. కష్ట సమయాలలో వ్యక్తి సహనాన్ని కోల్పోతాడు. మామూలుగా కష్టం వచ్చిన తర్వాత ఆనందం కూడా వస్తుంది. కానీ ఆ కష్టం వచ్చినప్పుడు తొందర పడకుండా వేచి చూడాలి. ఇక విశ్వాసం అనేది ముఖ్యమైనది.

 

కష్టమైనా సమయాలలో విశ్వాసం కోల్పోకూడదు. ఆత్మవిశ్వాసంతో ఉంటే పీకల్లోతు ఉన్న కష్టాలైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా గెలుస్తామన్న నమ్మకం ఉంటే కష్టం అనేది చిన్న చూపు అయిపోతుంది. దాంతో విజయం మన సొంతమవుతుంది. అదే ఓడిపోతాం అన్న భయం ఉంటే మాత్రం ఎప్పటికీ గెలవలెం. కాబట్టి ఇటువంటి కష్టం వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని వదులుకోవద్దని చాణక్యుడు తెలిపాడు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -