Charan-Upasana: టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోలు ఎవరు అంటే అందులో ఖచ్చితంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పేరు ఉంటుంది. ఒక్కో సినిమాలో తన నటనా ప్రాభవాన్ని చూపిస్తూ, ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు అందిస్తే బాగా చూస్తారో రామ్ చరణ్ కు బాగా తెలుసు. అందుకే వరుస విజయాలతో రామ్ చరణ్ దూసుకుపోతున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. మెగా కుటుంబంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే రామ్ చరణ్ అపోలో హాస్పిటల్స్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను పెళ్లి చేసుకోవడం తెలిసిందే.
రామ్ చరణ్, ఉపాసనలు చాలా సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్నా ఇప్పటి వరకు వీరు ఎలాంటి శుభవార్తను వినిపించలేదు. దీంతో అసలు ఏం జరుగుతోంది అనే చర్చ సాగుతోంది. ఆ మధ్యన పిల్లలు లేకపోతేనే బెటర్ అని ఉపాసన అన్నట్లు వార్తలు కూడా రావడం తెలిసిందే. అయితే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రామ్ చరణ్ భార్య ఉపాసన వల్లే పిల్లల విషయంలో జాప్యం జరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. ఉపాసన బరువు వల్ల పిల్లలను ఆలస్యంగా కనాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నాడట. ఆమె పిల్లలను కనడానికి సిద్ధంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు పిల్లల గురించి ప్లాన్ చేయబోతున్నట్లు కొన్ని గుసగుసలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.