Ram Charan: డ్యాన్స్ చేయాలని చరణ్ అనుకున్నా ఆ విధంగా చేశారా?

Ram Charan: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ గురించి, నాటు నాటు గురించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాగా నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఆస్కార్ వేదికపై ఈ నాటు నాటు పాటను ప్రత్యేకంగా ప్రదర్శించిన విషయం తెలిసిందే. కొంతమంది విదేశీ డాన్సర్లు ఈ పాటకు డాన్స్ స్టెప్పులను ఇరగదీశారు. అయితే ఇక్కడే చాలామంది అభిమానులకు అనేక రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే ఈ పాటకు స్టేజ్ పై డాన్స్ చేసినప్పుడు చరణ్, తారక్ అక్కడే ఉన్న విషయం తెలిసిందే. అలాగే నిర్వహకులు కోరితే మరోసారి ఆ పాటను రీక్రియేట్ చేసేందుకు చరణ్,తారక్ కూడా సిద్ధమే. కానీ అలా జరగలేదు. కేవలం కొంతమంది ఫారిన్ డాన్సర్లతోనే ఆ పాట పెర్ఫార్మెన్స్ పూర్తిచేశారు. మన సింగర్స్ మాత్రం స్టేజ్ పై మెరిశారు. ఇదే విషయంపై రామ్ చరణ్ స్పందించాడు. ఈ సందర్బంగా చెర్రీ మాట్లాడుతూ.. ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ ను మరోసారి పెర్ఫార్మ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అవకాశం వస్తే డాన్స్ చేయడానికి నేను వందశాతం రెడీ. కానీ ఏం జరిగిందో నాకు తెలీదు. వేరే ట్రూప్ డాన్స్ చేసింది.

 

వాళ్లు మాకంటే బాగా డాన్స్ చేశారు అని తెలిపారు చెర్రీ. స్టేజ్ పై అవార్డ్ అందుకున్న తర్వాత కీరవాణి ఇచ్చిన స్పీచ్ పై కూడా స్పందించాడు చరణ్. ఆస్కార్ వేదికపై కీరవాణి ప్రసంగం విన్నాను. స్టేజ్ పై అంతా టైమ్ ప్రకారం నడుస్తుంది. 45 సెకెన్ల తర్వాత వాళ్లు మైక్ కట్ చేస్తారు. ఈ విషయంలో రాజమౌళి చాలా పట్టింపుతో ఉన్నాడు. 45 సెకెన్ల లోపు స్పీచ్ పూర్తయ్యేలా కీరవాణితో రాజమౌళి చాలా ప్రాక్టీస్ చేయించాడు. దాదాపు 20 సార్లు కీరవాణి రిహార్సల్స్ చేశారు. కీరవాణి కూడా అద్భతంగా మాట్లాడారు అని చెప్పుకొచ్చారు చరణ్.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -