Chat GPT: ఆ యువకుడిని చాట్ జీపీటి లక్షాధికారిని చేసిందట.. ఏమైందంటే?

Chat GPT: గత కొద్దిరోజులుగా చాట్ జీపీటీ చేస్తున్న అద్భుతాలను చూస్తూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. కోడింగ్ చేయడంలో తనకు తానే సాటి అని తనకు ఎవరూ సాటి లేరనీ నిరూపిస్తోంది చాట్ జీపీటీ.ఇది మనం ఎలాంటి ప్రశ్నలు అడిగిన టకటక సమాధానం చెబుతుంది ఈ క్రమంలోనే ఒక యువకుడు తాను జీవితంలో డబ్బు సంపాదించడం ఎలా అని చాట్ జీపీటీను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చాట్ జీపీటీ చెప్పిన సమాధానం విన్నటువంటి యువకుడు ఆశ్చర్య పోవడమే కాకుండా అది చెప్పిన విధంగా చేస్తూ నేడు రోజుకు లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు.

 

వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఈ రోజుల్లో స్టార్టప్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. స్టార్టప్‌లు స్థాపించి కొందరు కొన్ని నెలల్లోనే కోటీశ్వరులు అవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఓ వ్యక్తి అద్భుత సృష్టించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయినటువంటి చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానాలతో నేడు జాక్సన్ ఫాల్ అనే వ్యక్తిలక్షల్లో ఆదాయాన్ని అందుకుంటున్నారు ఇక ఈ విషయాన్ని ఈయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

గేమ్ ప్లేలో నేను ChatGPT-4 AI బాట్‌ని లోడ్ చేశాను. మీ దగ్గర 100 డాలర్లు మాత్రమే ఉంది తాను మరింత డబ్బును సంపాదించడం ఎలా తప్పుడు మార్గంలో కాకుండా డబ్బును సంపాదించడం ఎలా అంటూ చాట్ జీపీటీ ప్రశ్నించారు. ఇలా ప్రశ్నలు అడగడంతో చాట్ జీపీటీ వెబ్‌సైట్‌ను రూపొందించాలని అని చాట్ జీపీటీ సూచించింది. వెబ్‌సైట్ ఎలా ఉండాలి, ఏయే ఆర్టికల్స్ ఉండాలి అని కూడా చాలా హెల్ప్ చేసింది. చాట్ జీపీటీ తనకు GreenGadgetGuru.com అనే డొమైన్ పేరును కూడా సూచించినట్లు తెలిపాడు.

 

ఇది మీకు పర్యావరణం పట్ల అనుబంధాన్ని కలిగిస్తుంది. తర్వాత ఓ గొప్ప లోగోని ఎంచుకుని ఇచ్చింది. బ్రాండింగ్ పద్ధతులను కూడా నేర్పించింది. కస్టమర్ల డిమాండ్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే ఉంచాలని చెప్పిందట. ఇలా చాట్‌జీపీటీ సహాయంతో ఈయన మార్చి 15న కంపెనీ ఏర్పడిందని, ఒక్క రోజులో కంపెనీ నిలబడిందని జాక్సన్ చెప్పారు. నేడు కంపెనీ మార్కెట్ విలువ 25,000 డాలర్లు దాటిందని తెలిపాడు. కంపెనీ వద్ద ప్రస్తుతం 1378.84 డాలర్లు ఉన్నట్లు జాక్సన్ తెలిపాడు

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -