Cancer-Sugar: ఈ చెట్టు రసంతో షుగర్, క్యాన్సర్ కు చెక్.. ఎలా అంటే?

Cancer-Sugar: ప్రస్తుత సమాజంలో ప్రతి 10 మందిలో ఆరుగురు డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ డయాబెటిస్ కారణంగా ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు. అయితే డయాబెటిస్ ఒక్కసారి వచ్చింది అంటే ఆఖరి శ్వాస వరకు పోదు అన్న విషయం తెలిసిందే. అయితే డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి రకరకాల మెడిసిన్స్ తో పాటు మన చుట్టూ ఉండే కొన్ని నేచురల్ ఇంగ్రిడియంట్స్ ని ఉపయోగించకూడదు. అందులో మునగ చెట్టు కూడా ఒకటి. మునగ ఆకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే మునగాకు పలు రకాల మొండి వ్యాధులను నయం చేస్తుంది. డయాబెటిస్ పేషెంట్లకు కూడా ఎంతో మంచి చేస్తుంది.

డయాబెటిస్ పేషెంట్లకు కలిగే లాభమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మున‌గ ఆకుల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా లభిస్తుంది. దాంతోపాటు విట‌మిన్ బి6, విటమిన్ ఎ, ప్రోటీన్లు, విట‌మిన్ బి2, ఐర‌న్‌, మెగ్నిషియం వంటి ముఖ్య‌మైన పోష‌క ప‌దార్థాలు మున‌గ ఆకుల్లో పుష్క‌లంగా ఉంటాయి. నిత్యం మున‌గ ఆకును మ‌న ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో ముందు చెప్పిన పోష‌కాల‌న్నీ మ‌న‌కు అందుతాయి. మున‌గ చెట్టు ఆకుల‌ను నిత్యం కూర‌, లేదా ర‌సం రూపంలో ఏదో ఒక విధంగా తీసుకున్న‌ట్ట‌యితే దాంతో శ‌రీరానికి కాల్షియం, ఐర‌న్ పుష్క‌లంగా అంది ఎముక‌లకు బ‌లం చేకూరుతుంది. తద్వారా ఎముకలు బలంగా మారుతాయి. మున‌గ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా లభిస్తాయి.

 

ఇవి శ‌రీరంలో ఏర్ప‌డే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్స‌ర్‌లు దూర‌మ‌వుతాయి. క్యాన్స‌ర్‌ క‌ణ‌జాలాల పెరుగుద‌ల‌ను అడ్డుకుంటాయి. విట‌మిన్ సి, బీటా కెరోటిన్‌లు కూడా ఉండ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ కార‌క ప‌దార్థాలు నాశ‌న‌మ‌వుతాయి. మున‌గ చెట్టు వేళ్ల‌ను తీసుకుని బాగా క‌డిగి వాటిని జ్యూస్‌లా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని నిత్యం బెల్లంతోపాటు తీసుకుంటుంటే త‌ల‌నొప్పి మాయ‌ం అవుతుంది. కొన్ని మున‌గ ఆకుల‌ను తీసుకుని పేస్ట్‌లా చేసి దానికి కొంత తేనెను క‌లిపి కంటి రెప్ప‌ల‌పై పెట్టుకుంటే నేత్ర సంబంధ స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. దృష్టి బాగా ఉంటుంది.

 

కంటి వాపు కూడా త‌గ్గుతుంది. కురుపులు న‌య‌మ‌వుతాయి. అదే విధంగా మున‌గ ఆకుల‌ను ఎండ బెట్టి పొడి చేసి 7 గ్రాముల మోతాదులో ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం ఉన్న వారి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది. మున‌గ చెట్టు ఆకుల్లో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్ గుణాలు ఉన్నాయి. ఈ ఆకుల‌కు చెందిన ర‌సాన్ని నిత్యం కొంత మోతాదులో తాగుతున్న‌ట్ట‌యితే ర‌క్తం శుద్ధి అవుతుంది. అందులో ఉన్న విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి.

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -