Mobile Apps: ఈ నాలుగు యాప్స్ మీ ఫోన్లో ఉన్నాయేమో చెక్ చేసుకోండి.. ఉంటే డిలీట్ చేయండి

Mobile Apps: మ‌నం తెలిసీ తెలియ‌కుండా కొన్నిసార్లు ఏవోవో యాప్స్‌ని మ‌న ఫోన్లో ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటాం. అయితే కొన్ని యాప్స్ మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌క‌పోగా లేనిపోని న‌ష్టాల‌ను కొనితెస్తాయి. అలాంటి ఓ 4 యాప్స్ ని మాల్‌వేర్ బైట్స్ (Malwarebytes) ల్యాబ్ గుర్తించింది. ఈ 4 యాప్స్ కూడా హిడెన్ యాడ్స్ ట్రోజ‌న్ ద్వారా ప్ర‌భావిత‌మైన‌విగా ఈ ల్యాబ్ పేర్కొంది. ఈ యాప్స్ మీ ప‌ర్స‌న‌ల్ స‌మాచార గోప్య‌త‌కు భంగం క‌లిగిస్తుంది. అలాగే ఇవి మీ డివైజ్‌కు కూడా హానిక‌ర‌మైన‌వి. అందుకే మీ ఫోన్‌లో కునుక ఈ నాలుగు యాప్స్ ఉంటే వెంట‌నే వీటిని అన్ ఇన్‌స్టాల్ చేయాల్సిందిగా ఈ సంస్థ స‌ల‌హా ఇస్తుంది. ఈ యాప్స్ పేర్లు మ‌రియు వాటి ప్ర‌భావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

 

ఏంటా ఆ నాలుగు యాప్స్
గ‌త నెల‌లో గూగుల్ స్టోర్‌లో గ‌ల 400 హానిక‌ర‌మైన యాప్‌లు యూజ‌ర్ లాగిన్ స‌మాచారాన్ని మ‌రియు వివ‌రాల‌ను దొంగ‌లిస్తున్నాయ‌ని ఫేస్‌బుక్ త‌న యూజ‌ర్ల‌కు హెచ్చ‌రించిది. ఇది జ‌రిగిన నెల‌రోజుల త‌రువాత  Malwarebytes ల్యాబ్ హిడెన్ యాడ్స్ ట్రోజన్ సోకిన ఒక నాలుగు యాప్‌ లను హైలైట్ చేసింది. దీని ప్ర‌కారం ఈ నాలుగు యాప్స్ ద్వారా మీ డేటా దొంగ‌లింప‌బ‌డే అవకాశం ఉందని ఈ ల్యాబ్ చెబుతోంది. ప్లేస్టోర్‌లో వ్యక్తిగత లేదా ఒక గ్రూప్ యాప్‌లు హానికరమైనవిగా గుర్తించబడటం మనం ఎప్ప‌టిక‌ప్పుడు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో ఈ నాలుగు యాప్స్ లను కొత్త బ్యాచ్ గా ఈ ల్యాబ్ గుర్తించింది. ఈ యాప్ వివ‌రాలను ఇక్క‌డ చూడొచ్చు .

 

1. Bluetooth Auto Connect

2. Bluetooth App Sender

3. Driver: Bluetooth, Wi-Fi, USB

4. Mobile transfer: smart switch

 

ఈ ల్యాబ్ తెలిపిన వివ‌రాల ప్రకారం, ఈ యాప్‌ లను డౌన్‌లోడ్ చేసిన 72 గంటలలోపు ఎలాంటి హానికరమైన ప్రవర్తనను చూపించ‌వు. అయితే, ఆ తరువాతే ఈ యాప్‌లు Chrome లో ఫిషింగ్ సైట్‌లను తెరిచి వినియోగదారులు ప్రకటనలపై క్లిక్ చేసిన‌ప్పుడు దాని ద్వారా ఆదాయాన్ని పొందుతాయి. వీటిలో కొన్ని యాడ్స్ లేదా సైట్స్ అంత ప్రమాదకరమైనవి కాకపోయినా, కొన్ని ఇతర సైట్‌లు మాత్రం చాలా ప్రమాదకరమైనవి. ఇవి కొత్త అప్డేట్ కోసం క్లిక్ చేయండి, అంటూ యూజర్లను మోస‌గించే ప్ర‌య‌త్నం చేస్తాయి.

 

మాల్వేర్‌బైట్స్ ల్యాబ్స్ విశ్లేషకుడు అయిన నాథన్ కొల్లియర్, ఈ డెవలపర్ గతంలో గూగుల్ ప్లేలో మాల్వేర్‌ను వ్యాప్తి చేశారని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రసిద్ధ బ్లూటూత్ ఆటో కనెక్ట్ యాప్ యొక్క కొన్ని వెర్షన్లు మాత్రం గతంలో క్లీన్ గా ఉన్నాయని ఆయ‌న ఈ సంద‌ర్భంగా తెలిపాడు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -