Chenna Kesava Reddy: బాలయ్య రేంజ్ ఇదే. చెన్నకేశవరెడ్డి రీరిలీజ్ కలెక్షన్లు ఎన్ని రూ.కోట్లంటే?

Chenna Kesava Reddy: నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం చెన్నకేశవరెడ్డి. ఈ సినిమాలో బాలకృష్ణ మొదటిసారిగా ద్విపాత్రాభినయంలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక హీరోకి సంబంధించి ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు తప్పకుండా వారి సినిమాలను తిరిగి విడుదల చేయడం ట్రెండ్ అవుతుంది.

ఈ క్రమంలోనే పోకిరి జల్సా వంటి సినిమాలు తిరిగి విడుదల కాగా ప్రేక్షకులు ఈ సినిమాలను భారీగా ఆదరించారు. ఈ క్రమంలోనే వివి వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాని కూడా 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాని తిరిగి విడుదల చేశారు. అయితే ఈ సినిమా తిరిగి విడుదల చేయగా ఊహించని స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది.

అన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఈ సినిమాని నందమూరి అభిమానులు ఎంతో విజయం వంతం చేశారు. ఇక ఈ సినిమా రాబట్టిన వసూలు అన్నింటిని కూడా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి విరాళంగా ప్రకటిస్తామని నిర్మాత బెల్లంకొండ వెల్లడించారు.ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బెల్లంకొండ ఈ సినిమా గురించి ఈ సినిమా రాబట్టిన కలెక్షన్ల గురించి తెలియజేస్తూ పలు విషయాలను వెల్లడించారు.

మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా తిరిగి విడుదల కాగా ఈ సినిమా 1.73 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అలాగే పవన్ కళ్యాణ్ జల్సా సినిమా 3.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.ఇక బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి సినిమా ఏకంగా 5.39కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది ఈ సినిమా తిరిగి ఈ స్థాయిలో కలెక్షన్లను రాబట్టడంతోనే బాలయ్య స్టామినా ఏంటో అర్థం అవుతుంది. ఇక ఈ సినిమాకు వచ్చిన ఈ కలెక్షన్లు అన్నింటిని కూడా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు విరాళంగా ప్రకటించినట్లు నిర్మాత తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -