Chiranjeevi: వాల్తేరు వీరయ్య డేట్ విషయంలో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా లేరా?

Chiranjeevi: సంక్రాంతి అంటేనే పెద్ద సీజన్ తెలుగు ఇండస్ట్రీకి. దాదాపు ప్రతి సీజన్ కి పెద్ద హీరోల చిత్రాలు రిలీజ్ అవ్వడం, అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకి వెళ్ళడం పరిపాటే.ఎప్పటి నుంచో ఈ ట్రెండ్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి చందమామ బాలకృష్ణ చాలా సార్లు సంక్రాంతికి పోటీ పడ్డారు.ఇంకొకసారి మనకి ఈ పోటీ చూసే అవకాశం లభించబోతోంది.బాలయ్య బాబు వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య వచ్చే నెల విడుదలకి సిద్ధమవుతున్నాయి. బాలయ్య బాబు చిత్రం జనవరి 12న వస్తుంటే చిరంజీవి చిత్రం జనవరి 13న వస్తుంది.

మెగాస్టార్ చిత్రం సంక్రాంతికి వస్తుంది అనే సంతోషం కూడా లేదట అభిమానులకి. సోషల్ మీడియా ద్వారా తమ బాధని వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళకున్న బాధ ఏంటో ఇప్పుడు చూద్దాం.

మెగా అభిమానులు హ్యాపీగా లేరా?

మెగాస్టార్ సినిమా అంటేనే రికార్డ్స్ కి పెట్టింది పేరు. అయితే ఈ సారి అది జరకపోవచ్చు. ఎందుకంటే అందరికంటే చివరన వస్తున్నారు మెగాస్టార్. రెండు అనువాద చిత్రాలు,తరువాత బాలయ్య బాబు దాని తరువాత చిరంజీవి వస్తారు. తమిళ స్టార్ హీరో విజయ్ వారసుడు కాంట్రవర్సీ సద్దు మనిగింది. ఆ చిత్రం భారీ స్థాయిలో విడుదలకి సిద్ధం అవుతోంది.

మొన్నటి వరకూ చప్పుడు లేని అజిత్ చిత్రం కూడా విడుదలకి సిద్ధం అవుతుంది తెలుగులో. సంక్రాంతి సీజన్ మొదలుపెట్టేది అజిత్ చిత్రం. తరువాత రోజు వారసుడు, వీర సింహా రెడ్డి వస్తాయి. అప్పటికే థియేటర్లలో వాటి సందడి మొదలవుతుంది. వాటిని దాటుకుని చిరంజీవి చిత్రం డే 1 రికార్డ్స్ కొట్టడం కొద్దిగా కష్టం అవుతుంది అంటున్నారు అభిమానులు. చూడాలి మరి ఏం జరుగుతుందో. వాల్తేర్ వీరయ్య కి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. చిత్రం ఏంటంటే బాలయ్య బాబు చిత్రం వీరసింహారెడ్డినీ కూడా వీరే నిర్మిస్తున్నారు. రెండు చిత్రాల్లో అందాల భామ శృతి హాసన్ కథానాయిక.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: జగన్ పై ఎక్కడ దాడి జరిగినా కుట్ర బాబే చేశారా.. బాబును ఓడించాలనే కుట్రలా?

YS Jagan: తనపై జరిగిన గులకరాయి దాడిపై సీఎం జగన్ తొలిసారిగా స్పందించారు. గుడివాడలో సోమవారం సాయంత్రం జరిగిన మేమంతా సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. దేవుడు దయవలన రాయి కంటి దగ్గర,...
- Advertisement -
- Advertisement -