Chiranjeevi Balayya: మెగాస్టార్ తో సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్.. ఏమైందంటే?

Chiranjeevi Balayya: టాలీవుడ్ అంటేనే గుర్తుకొచ్చేది చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వంటి అగ్ర హీరోల పేర్లు టక్కున గుర్తుకు వస్తాయి. ఈ టాప్ హీరోల సినిమాలు వేరువేరుగా విడుదల అయితేనే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. మరి అలాంటిది ఒకే సినిమాలో చిరంజీవి బాలయ్య కలిసి నటిస్తే ఎలా ఉంటుందో ఊహించండి.

చిరంజీవి స్టెప్స్ కి , బాలయ్య మైండ్ బ్లోయింగ్ డైలాగ్స్ కి కాంబినేషన్ కుదిరితే ఆ మూవీ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందో చెప్పనవసరం లేదు. ఒకవేళ వీళ్ళిద్దరి కాంబోలో మూవీ వచ్చినట్లయితే కచ్చితంగా ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబో ని ఇది దాటిపోతుంది. మల్టీస్టారర్ మూవీస్ రావడం అనేది టాలీవుడ్ లో కొత్త కాదు. ప్రస్తుతం యంగ్ హీరోస్ చాలామంది మల్టీ స్టార్ మూవీస్ పై మక్కువ చూపుతున్నారు.

కానీ సినీ దిగ్గజాలైన అగ్ర హీరోలు మాత్రం ఇంతవరకు మల్టీస్టారర్లపై దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో బాలయ్య , చిరంజీవి కలిసి మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు అన్న పుకారు సినీ ఇండస్ట్రీలో షికార్లు చేస్తోంది. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను మైత్రి మూవీ మేకర్స్ నిర్వహిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ నిర్మాణ సంస్థల్లో
మైత్రీ మూవీమేక‌ర్స్ అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం సెన్సేషనల్ హిట్ అయిన అల్లు అర్జున్ పుష్ప మూవీ ను కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాతలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. మీ బ్యానర్ లో చిరంజీవ – బాల‌య్య కాంబోలో మ‌ల్టీ స్టార‌ర్ సినిమా వస్తుంది అని అంటున్నారు, నిజ‌మేనా అంటూ ప్ర‌శ్నించ‌గా. దానికి వారు ” చిరంజీవి బాల‌కృష్ణ‌ల‌తో సినిమా తీసే అవకాశం వ‌స్తే ఎవరైనా ఎందుకు వదులుకుంటారు ” అని సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ తో చిరు, బాల‌య్య కాంబో మూవీ పైన ఆశక్తి ఇంకా పెరిగింది.

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -