Chiranjeevi-Chandramohan: చిరంజీవిపై షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రమోహన్

Chiranjeevi-Chandramohan: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరిగా రాణిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిదే. ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి సీనియర్ నటుడు చంద్రమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చంద్రమోహన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

మెగాస్టార్ చిరంజీవి విజయం లో ఆయన ఈ స్థాయి స్టార్డం దక్కించుకోవడంలో ఆయన బావమరిది అల్లు అరవింద్ పాత్ర అత్యంత కీలకమైనది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రమోహన్. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ.. భారతంలో అర్జునుడిని శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే గైడ్ చేసేవాడో అదేవిధంగా సిని ఇండస్ట్రీలో చిరంజీవి వెనుక అల్లు అరవింద్ ఉన్నాడు. శ్రీకృష్ణుడు సారథిగా లేకపోతే అర్జునుడు నథింగ్ అలాగే అరవింద్‌ మెయిన్ గైడెన్స్ లేకపోతే చిరంజీవి నథింగ్ అంటూ చిరు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు చంద్రమోహన్. చిరంజీవి ఎటువంటి పాత్ర చేయాలి..ఎంత పారితోషకం తీసుకోవాలి.

 

ఇలా విషయంలో ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా అల్లు అరవింద్ తీసుకునేవారు. అందుకే ప్రస్తుతం చిరంజీవి ఈ స్థాయిలో ఉన్నారు. చిరు ఈ స్తాయిలో ఉన్నారు అంటే కచ్చితంగా అది అల్లు అరవింద్ ప్లానింగ్ వల్లే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రమోహన్. మరి చంద్రమోహన్ చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Janasena Complaint on YS Jagan: ఏపీ ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల.. జగన్ కు భారీ షాక్ తప్పదా?

Janasena Complaint on YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభకు వెళ్లిన అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -