Chiranjeevi: ఆచార్య ప్లాప్…80 శాతం రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేశాం: చిరు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి హిట్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా మీడియాతో కూడా ముచ్చటించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన గాడ్ ఫాదర్ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఈ మీడియా సమావేశంలో భాగంగా మరోసారి ఆచార్య సినిమా ప్రస్తావనకు వచ్చింది. అదేవిధంగా గరికపాటి వివాదం కూడా ఈ మీడియా సమావేశంలో ప్రస్తావనకు రావడంతో ఈ విషయాలపై చిరంజీవి మాట్లాడుతూ తన అభిప్రాయాలను వెల్లడించారు. ముందుగా ఆచార్య సినిమా గురించి ఈయన మాట్లాడుతూ ఆచార్య సినిమా ఫ్లాప్ అవడంలో ఎలాంటి రిగ్రేట్ గా ఫీల్ అవ్వాల్సిన పనిలేదని తెలిపారు.

ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో 80% రెమ్యునరేషన్ తాను చరణ్ నిర్మాతలకు తిరిగి వెనక్కి ఇచ్చేసామని ఈ సందర్భంగా ఈయన తెలిపారు. మేము నటించిన ఏ సినిమా ప్లాప్ అయినా ఆ సినిమా బాధ్యత మేమే తీసుకుంటామని తెలిపారు. ఇకపోతే ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో 80% రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చినట్లు ఈ సందర్భంగా చిరు తెలిపారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా గరికపాటి వివాదం కూడా ప్రస్తావనకు వచ్చింది.దసరా పండుగ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గరికపాటి చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. అయితే గరికపాటి పై మెగా అభిమానులు పలువురు సెలబ్రిటీలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మెగాస్టార్ స్పందించలేదు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వివాదం పై ఈయన స్పందిస్తూ గరికపాటి వారు పెద్దవారు ఆయన చేసిన వ్యాఖ్యలపై వివాదం అవసరం లేదంటూ మొదటిసారి గరికపాటి వివాదంపై స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts