Chiranjeevi: తెలుగు ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రస్తుతం అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు.. ఈ సినిమాతో ఊహించని స్థాయిలో తన అభిమానులను నిరాశపరిచాడు. ఇక ఈ దసరా కానుకగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు.
కాగా ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అక్టోబర్ 5న ఈ సినిమా థియేటర్లలో హడావిడి చేయబోతుంది. ఈ క్రమంలో గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ ఛానల్ తో చిరంజీవి మాట్లాడాడు. ఆ ఛానల్లో ఒక యాంకర్ ఇదివరకు రాజమౌళితో పని చేయనని అన్నారు కదా.. ఎందుకు? అని ప్రశ్నించింది. దీనికి చిరంజీవి మాట్లాడుతూ.. రాజమౌళి గొప్ప దర్శకుడు. భారతదేశ చలనచిత్ర ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశాడు.
ఇక ప్రతి విషయాన్ని ఆయన ఎంతో లోతుగా చూస్తారు. ఆయన కోరుకునే అవుట్ పుట్ ఓ నటుడుగా నేను ఇవ్వగలనో లేదో నాకు తెలియదు. ఇక ఒక సినిమాను తెరకెక్కించడానికి తాను ఎంతో సమయం తీసుకుంటాడు. ఒక్క సినిమాకు మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఆయన సమయం తీసుకుంటాడు. నేను ఒకేసారి నాలుగు చిత్రాలు చేస్తున్న కాబట్టి రాజమౌళితో పని చేయాలని, పాన్ ఇండియా నటుడుగా గుర్తింపు తెచ్చుకోవాలని లేదు అని తెలిపాడు చిరంజీవి.
ఇక తన టాలెంట్ కు తన కొడుకు రామ్ చరణ్ కొనసాగింపుతాడు అని చిరంజీవి తెలిపాడు. ఏదేమైనా చిరంజీవి మాత్రం ప్రస్తుతం అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. అక్టోబర్ ఐదు న మలయాళం లో లూసిఫర్ చిత్రానికి రీమేక్ గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా భారీ స్థాయిలో హిట్ అందుకుంటుందని చిరంజీవి అనంతపురంలో జరిగిన ఈవెంట్లో బల్ల గుద్దినట్లు తెలిపారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.