Chiranjeevi: చిరంజీవి గొప్ప గుణానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి ఒకవైపు హీరోగా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ బ్లడ్ బ్యాంకులో ఐ బ్యాంకులో పెట్టి ఎంతోమందికి ఆసరాగా నిలుస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి సమయంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన సామాజిక కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్ల విరాళాలతో సహాయ కార్యక్రమాలు చేపట్టడం మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు.

కేవలం ఇవి మాత్రమే కాకుండా భవిష్యత్తులో తన సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించాలని చిరంజీవి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన చారిటీ విషయంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఇన్ని రోజులు కుటుంబం గురించే ఆలోచించాను ఇక సమాజానికి తిరిగి ఇవ్వడం మీద దృష్టి పెడతాను అని చిరంజీవి తెలిపారు. ఇంతకాలం నాకేంటి నా కుటుంబానికి ఏంటి అని ఆలోచించాను. కానీ ఇక చాలు. ఎందుకంటే నా కుటుంబ సభ్యులు అందరూ అత్యున్నత స్థానంలో ఉన్నారు. భగవంతుడు నాకు అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడు. దానిని సమాజానికి తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నాను.

కీర్తి గ్లామర్ అన్నవి శాశ్వతం కావు. వ్యక్తిత్వమే శాశ్వతమని నేను నమ్ముతాను అని చెప్పుకొచ్చాడు మెగాస్టార్. చిరంజీవి మాట్లాడిన బట్టి చూస్తే తన ఆస్తి మొత్తాన్ని అయినా రాసేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలి అన్న సంకల్పంతో చిరంజీవి ముందుకు వెళ్తున్నాడు. చిరంజీవి ఈ ఎంత గొప్ప గుణానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. కాగా చిరంజీవి చేస్తున్న గొప్ప పనిని చూసి ఇండస్ట్రీలో ఎంతోమంది ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -