Mega Family: మెగా కాంపౌండ్ లో మారుతున్న పరిస్థితులు… ఒంటరవుతున్న చిరంజీవి?

Mega Family: ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగా సామ్రాజ్యాన్ని ఏర్పరిచిన మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలలో తనకున్న అనుభవంతో ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్న చిరంజీవి.. ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరలు తగ్గించినప్పుడు సీఎం జగన్ దగ్గరకు వెళ్లి కలిసినప్పటి నుండి కొందరు సినీ ప్రముఖులు అతని మీద విమర్శలు చేస్తూ.. ఇతరులతో కూడా విమర్శలు చేయిస్తున్నారు. అంతేకాకుండా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి విడుదల చేయటానికి సిద్ధమవుతోంది.

చిరుకి పోటీగా బాలయ్య రంగంలోకి దిగనున్నాడు. డిసెంబర్లో విడుదల చేయాల్సిన బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా సంక్రాంతికే బరిలోకి దింపుతున్నారు. బాలకృష్ణ చిరంజీవి మధ్య ఎంతో కాలంగా మాటలు లేవని అందరికీ తెలిసిందే. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి చిరంజీవిని ఆహ్వానించడానికి బాలయ్య నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇలా సినిమాల విషయంలో బాలకృష్ణ చిరంజీవికు మధ్య పోటీ నడుస్తూనే ఉంది.

చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ మాత్రం బాలకృష్ణతో తన బంధం మరింత బలం చేసుకుంటున్నాడు. ఇప్పటికే అన్ స్టాపబుల్ షో ని బాలకృష్ణ చేతుల మీదుగా నడిపించటమే కాకుండా అల్లు శిరీష్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్యని ముఖ్యఅతిథిగా ఆహ్వానించాడు. ఇక మరోవైపు చిరంజీవి సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా టిడిపికి మద్దతు ఇచ్చాడు. ఇలా పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ ఇద్దరూ కూడా బాలకృష్ణకి సపోర్ట్ చేస్తున్నారు.

ఇలా సొంతం అనుకున్న మనుషులే చిరంజీవికి అన్యాయం చేయటంతో ప్రస్తుతం చిరంజీవి ఒంటరి వాడవుతున్నాడేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా మెగా సామ్రాజ్యాన్ని ఏర్పరచిన చిరంజీవికి ఎవరితోడు లేకపోయినా కూడా వచ్చే నష్టం ఏం లేదని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -