Chiranjeevi Nagarjuna: చిరంజీవిని కాదని బాలకృష్ణను పిలుస్తున్నారా?

Chiranjeevi Nagarjuna: తెలుగు ప్రేక్షకులకు గ్రీకువీరుడిలా దశాబ్దాలు పరిచయం ఉన్న పేరు అక్కినేని నాగార్జున. సినిమాలతో పాటు పలు టీవీ షోలు, రియాల్టీ షోలను నాగార్జున నిర్వహిస్తుండటం తెలిసిందే. ఇదే క్రమంలో ఆయన బిగ్ బాస్ సీజన్ 6కి హోస్ట్ గా వ్యవహరిస్తుండటం తెలిసిందే. అయితే ఈ సీజన్ ఆరంభం అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాకపోవడం తెలిసిందే.

 

బిగ్ బాస్ ప్రతి సీజన్ ఫైనల్ ఎపిసోడ్ మీద భారీ అంచనాలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా బిగ్ బాస్ నిర్వాహకులు కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈ భారీ ఎపిసోడ్ కి గతంలో చిరంజీవి, వెంకటేష్ లు గెస్టులు వచ్చారు. అయితే ఈసారి ఎవరు వస్తారనే చర్చ సాగుతుండగా.. చిరంజీవిని కాదని వేరే సెలబ్రెటీని పిలుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ గా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవిని కాదని, ఈ మధ్యన బాగా ప్రచారంలో ఉన్న నందమూరి బాలకృష్ణను బిగ్ బాస్ సీజన్6 ఫైనల్ ఎపిసోడ్ గెస్టుగా పిలవాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. అందుకోసం నందమూరి బాలయ్యను ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది.

 

బిగ్ బాస్ సీజన్ 6 ఫైనల్ ఎపిసోడ్ ని హిట్ చేయాలంటే నందమూరి బాలయ్యను పిలిస్తేనే మంచిదని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. అటు ఈ విషయంలో బాలయ్యను రప్పించడానికి అక్కినేని నాగార్జునని కూడా వాడుకోవాలని బిగ్ బాస్ నిర్వాకులు అనుకుంటున్నారట. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -