Chiranjeevi Dance: చిరంజీవి వేసిన పోతరాజు స్టెప్పులు చూశారా?

Chiranjeevi Dance:  తెలుగు తెర మీద తిరుగులేని స్టార్ గా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ కార్యక్రమంలో వేసిన పోతరాజు స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. డ్యాన్స్ కే వన్నె తెచ్చేలా చిరంజీవి వేసే స్టెప్పుల గురించి అందరికీ తెలిసిందే. అలాంటి చిరంజీవి పోతరాజు స్టెప్పులు వేయడం ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.

దసరా సందర్భంగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా దత్తాత్రేయ ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆయన ఆహ్వానించారు. గతంలో కూడా చాలామంది సినీ తారలు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమంలో సందడి చేయగా.. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి ఆకట్టుకున్నారు.

దసరా సందర్భంగా అందరిలో సోదర భావానికి గుర్తుగా దత్తాత్రేయ ప్రతి సంవత్సరం అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. గతంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వారు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. కార్యక్రమంలో పోతరాజుతో కలిసి వేసిన స్టెప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గాడ్ ఫాదర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇలా పోతరాజు స్టెప్పులు వేయడం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. పోతరాజు స్టెప్పులు వేస్తున్న చిరంజీవి వీడియోను అభిమానులు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. కాగా చిరంజీవి చేసిన తాజాగా చిత్రం ‘గాడ్ ఫాదర్’ హిట్ టాక్ తెచ్చుకోవడం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

MLA Grandhi Srinivas: పవన్ అభిమానులు లేకపోతే చిరు సినిమాలు ఆడవా.. వైసీపీ మూర్ఖత్వానికి హద్దుల్లేవా?

MLA Grandhi Srinivas: కొందరు రాజకీయ నాయకుల విమర్శలు చూస్తే నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. చేసే విమర్శలకు జరిగే పరిణామాలకి ఏమాత్రం పొంతన కుదరని విమర్శలు వారినే నవ్వులపాలు...
- Advertisement -
- Advertisement -