Chiranjeevi: మెగాస్టార్ భార్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన రాధిక!

Chiranjeevi: సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పేస్తారు. బుల్లితెర, వెండితెరపై ఓ వెలుగు వెలుగుతోన్న రాధికకు.. స్టార్‌ హీరోలు, సినీ ప్రముఖులతో మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవితోనూ మంచి స్నేహబంధం ఉంది. అలాగే బాలయ్యతోనూ మంచి బాండింగ్ ఉంది. అప్పట్లో బాలయ్య మీద రాధిక ఒక్క ఈగ కూడా వాలనిచ్చేది కాదట. ఈ విషయాన్ని బాలయ్య ఆహా సమర్పణలోని ‘అన్‌స్టాపబుల్’ షోలో తెలిపాడు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ షో సీజన్-2 నాలుగో ఎపిసోడ్‌లో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేష్ రెడ్డి వచ్చిన విషయం తెలిసిందే. వీరిందరూ కలిసి వేదికపై క్రికెట్ ఆడారు. అప్పుడు సడెన్‌గా రాధిక ఎంట్రీ ఇచ్చింది.

 

 

అంపైర్ లేకుండా గేమ్ ఎలా ఆడుతున్నారని మధ్యలో ఇన్వాల్ అయింది. ఈ తర్వాత కొంచెం సేపు సరదాగా ఆటలాడారు. ఆ తర్వాత ముగ్గురిని బాలయ్య తన స్టైల్‌లో ప్రశ్నించాడు. ఈ క్రమంలో రాధిక.. తాను నటించిన స్టార్ హీరోలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘ఇప్పటివరకు కమల్ హాసన్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, విజయ్ కాంత్, చిరంజీవి వంటి స్టార్ హీరోల నటించావు?.. కానీ నాలాంటి సూపర్ స్టార్‌తో ఎందుకు నటించలేదని బాలయ్య ఫన్నీ కొషన్ అడిగాడు. సూపర్ స్టార్ రజనీకాంత్‌లో నీకు నచ్చిన విషయమేమిటని బాలయ్య.. రాధికను ప్రశ్నించాడు. దానికి రాధిక.. రజనీకాంత్ తన పనిలో తాను ఉంటారు. ఎక్కడలో మూలలో కూర్చుంటాడని చెప్పింది. దానికి బాలయ్య ఇన్వాలై.. అంటే రజనీకాంత్ బోరింగ్ క్యాండెట్ అంటావు అని చెప్తే.. దానికి రాధిక అవునని చెప్పింది.

 

 

ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ..‘కమల్ హాసన్ వృత్తిపై ఎంతో డెటికేట్‌గా ఉంటాడు. ఆయనకున్న ఏకాగ్రత అద్భుతం. అమితాబ్ బచ్చన్.. ఓ రియల్ జెంటిల్‌మెన్. అలాగే చిరంజీవి గురించి చెప్పాలంటే.. అతడితో ఎప్పుడూ గొడవయ్యేది. ఏంటే నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావని చిరంజీవి అంటాడు. దానికి నేను.. నువ్వు మాత్రం ఎంటి అని అంటాను. మా ఇద్దరి మధ్య సీరియస్‌గానే వాదన జరుగుతుంది. మా ఇద్దరి గొడవ మధ్య చిరంజీవి భార్య సురేఖ అంపైర్‌గా ఉండేది.’ అని ఆమె చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -