Godfather: గాడ్ ఫాదర్ సినిమాకి చిరంజీవి ఎంత తీసుకున్నాడో తెలుసా?

Godfather: మెగాస్టార్ మెగా పెర్ఫార్మన్స్ తో మన ముందుకొచ్చిన సినిమా గాడ్ ఫాదర్.. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ సినిమాలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలతో పాటు హీరో చరణ్ కూడా వాటాదారే. అంతే కాదండీ.. అసలు ఈ సినిమా హక్కులు కొనిపించింది చరణే..! విడుదలకు ముందు డెఫిసిట్ లో విడుదలయింది. ఎందుకంటే నాన్ థియేటర్ డబ్బులు పూర్తిగా రాలేదు. అడ్వాన్స్ లు మాత్రమే వచ్చాయి. అలాగే చాలా తక్కువ అడ్వాన్స్ ల మీద సినిమా థియేటర్ హక్కులు ఇచ్చారు.

తన కొడుకు మెగా పవర్ స్టార్.. రామ్ చరణ్ నిర్మాతగా ఉన్నప్పటికీ.. తండ్రి హీరో అయినా.. రెమ్యూనిరేషన్ విషయంలో మాత్రం ఇద్దరూ పక్కాగా వున్నారని ఫిలిం వర్గాలలో పెద్ద చర్చే నడిచింది.

మెగాస్టార్ కు అక్షరాలా 50 కోట్ల రెమ్యూనిరేషన్ ముందుగానే ఇచ్చేసినట్లు సినీ టాక్. సినిమా కలెక్షన్లు టాప్ హీరోల రేంజ్ లో లేకపోయినా, మెగాస్టార్ రెమ్యూనిరేషన్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అంతే కాదు ప్రత్యేక పాత్రలో అలరించిన కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు విడుదల తరువాత భారీ గిఫ్ట్ ఇవ్వడం కోసం 5 కోట్లు అలాట్ చేసారని గుసగుసలు వినిపించాయి. సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చెప్పినట్టు.. రెమ్యూనిరేషన్ ఇవ్వబోతే సల్మన్ తీసుకోలేదని, తరువాత చరణ్ వెళ్లి ఏదో ఒకటి చేస్తాడని చెప్పారు. అది ఇదేనేమో. కానీ అది డబ్బు రూపంలో కాకుండా గిఫ్ట్ రూపంలో వుంటుందని తెలుస్తోంది.

ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. 50 కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ నైజాంలో 30 కోట్లకు లోపే చేసింది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ అందులో సగం కూడా చేయడం లేదు. మొత్తానికి కలెక్షన్ల మాట ఎలా ఉన్నా కానీ బాక్సాఫీస్ వద్ద సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకొని, చాలా రోజుల తర్వాత మెగా అభిమానుల్లో సందడి తెచ్చిందనేది మాత్రం వాస్తవం.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -