Chiranjeevi RGV: ఆర్జీవీ ట్వీట్లపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్ వైరల్!

Chiranjeevi RGV: తెలుగు సినీ పరిశ్రమకు గాడ్ ఫాదర్‌గా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన మెగాస్టార్.. ‘ఖైదీ నంబర్ 150, సైరా నర్సింహారెడ్డి, ఆచార్య’ వంటి సినిమాల్లో నటించారు. కానీ ఈ సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. ఇటీవల విడుదలైన ‘గాడ్ ఫాదర్’ సినిమా మాత్రం కమర్షియల్ హిట్ అందుకుంది. కలెక్షన్ల పరంగా దూసుకెళ్లింది. సినిమా సక్సెస్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. తాజాగా చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. మెగాస్టార్‌ చిరంజీవిలో మిస్ అయిన మాస్ యాంగిల్.. ఈ సినిమాలో కనిపించనుందని అభిమానులు ఆతురతగా ఎదురు చూస్తున్నారు.

 

కాగా, గతంలో చిరంజీవి ప్రముఖ దర్శకుడు ఆర్జీవీపై చేసిన కామెంట్లు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇందులో యాంకర్‌గా రోజా వ్యవహరించారు. ఈ సందర్భంగా రోజా.. మెగాస్టార్ చిరంజీవిని పలు ప్రశ్నలు అడిగింది.

 

నాగబాబుపై నిప్పులు చెరిగే రామ్ గోపాల్ వర్మ.. పవన్ కళ్యాణ్‌పై ప్రేమ కురిపించడానికి కారణమేమిటి? అని రోజా ప్రశ్నించారు. దానికి చిరంజీవి సమాధానమిస్తూ..‘రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడటం వేస్ట్ (నవ్వుతూ). అతడిది చాలా డిఫికల్ట్ మైండ్ సెట్. ఎప్పుడు ఎలా ఉంటాడో.. ఎప్పుడేం మాట్లాడుతాడో అతడికి తెలియదు. ఒకరిని పొగుడుతూనే.. మరొకరిని కించపరుస్తూ మాట్లాడుతాడు. సినిమాకు సంబంధించి ఏదైనా స్టిల్స్ విడుదల చేసినా.. ఏదో ఒక లోపం చూపిస్తూ కామెంట్స్ చేస్తూనే ఉంటాడు. ఆర్జీవీకి సంస్కారం కంటే వెటకారం ఎక్కువ. అలాగే అంతటి మేధావి కూడా. వెటకారాన్ని తగ్గించుకుని డైరెక్టర్‌గా రాణిస్తే.. ఇంకా గొప్ప స్థాయికి ఎదుగుతాడు.’ అని పేర్కొన్నారు.

నాగబాబును తిట్టేందుకు ధైర్యం చూపిస్తున్న ఆర్జీవీ.. పవన్ కళ్యాణ్‌ను తిట్టేందుకు భయపడతాడా? అని రోజా ప్రశ్నించారు. దానికి చిరంజీవి మాట్లాడుతూ..‘ఆర్జీవీకి పవన్ కళ్యాణ్‌పై ప్రేమేం లేదు. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్‌ను తిట్టాడు. కానీ పవన్ అలాంటి విషయాలు పట్టించుకోడు. కానీ నాగబాబు మాత్రం కొంచెం ఎమోషనల్. ఏ విషయంపై కూడా తొందరగా రియాక్ట్ అవుతుంటాడు. కానీ పవన్ అలా కాదు.. సైలెన్స్ లోనూ ఆన్సర్ ఇచ్చేస్తాడు.’ అని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -