Chiranjeevi: పవన్ కు మద్దతు ప్రకటించిన చిరంజీవి.. సీఎం జగన్ భారీ షాకేగా?

Chiranjeevi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు రేపు అనగా అక్టోబర్ ఐదు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు ముందుకు రాబోయే గాడ్ ఫాదర్ సినిమా గురించి పరిచయం అక్కర్లేదు. ఈ సినిమాకు ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి, నయనతార, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆచార్యతో పూర్తిగా నిరాశ చెందిన మెగా అభిమానులు.. ఇప్పుడు గాడ్ ఫాదర్ పై భారీ ఎత్తులో ఆశలు పెట్టుకున్నారు.

ఇక చిరంజీవి కూడా ఈ సినిమా విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బుధవారం గాడ్ ఫాదర్ సినిమా విడుదలవుతున్న నేపథ్యం లో హైదరాబాదులో చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ ఏర్పరిచింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. ఇటీవల సినిమా ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి, నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ ఒక డైలాగ్ చిరంజీవి ట్విట్ చేశాడు.

ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఆ డైలాగు గురించి ప్రస్తావించారు. ఆ డైలాగు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే నేనేమీ చేయలేనని చిరంజీవి తెలిపారు. భవిష్యత్తులో తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన మద్దతు ఉంటుందని తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ కు అంకితభావం కలిగిన నాయకుడు అవసరం అని.. ఆ అవకాశాన్ని పవన్ కు ప్రజలు ఇస్తారని నేను భావిస్తున్నట్లు తెలిపాడు.

చిరంజీవి మాటలు విన్న కొందరు చిరు మాటలకు జగన్ షాక్ అవుతాడు అని అనుకుంటున్నారు. ఇక మెగా అభిమానులు మాత్రం ఈ విషయంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కి చిరంజీవి తోడైతే జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని చాలామంది అనుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -