Chiranjeevi: కొరటాల శివను మళ్లీ బలి చేసిన చిరంజీవి.. ఇంత పగ ఎందుకో మరీ!

Chiranjeevi: తెలుగు సినీ ప్రియులకు దర్శకుడు కొరటాల శివ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సినిమా రచయితగా తన కెరీర్ స్టార్ట్ చేసిన కొరటాల శివ, మిర్చి సినిమాతో దర్శకుడుగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ని శివ మరో స్థాయిలో చూపించాడు. అలా ఇండస్ట్రీలో పలు సినిమాలకు ప్రాణం పోసి మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు.

ఇక ఇటీవలె కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించాడు. అందులో తన కొడుకు రామ్ చరణ్ ఒక ప్రధాన పాత్ర పోషించాడు. ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా గురించి ప్రేక్షకులకు భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. కాగా ఈ సినిమా మెగా అభిమానులను ఊహించని స్థాయిలో నిరాశపరిచింది. సినిమా విడుదల రోజునే నెగిటివ్ టాక్ అందుకుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా పూర్తిగా డిజాస్టర్ గా నిలిచింది.

ఈ సినిమా ఇలా అవ్వడానికి కారణం కొరటాల శివ తొందరపాటే అన్నట్లుగా చిరంజీవి గతంలో కొన్ని కామెంట్లు చేశాడు. అప్పట్లో చిరంజీవి చేసిన కామెంట్ల గురించి ఇండస్ట్రీ వర్గాలు పలు రకాలుగా మాట్లాడుకున్నాయి. కాగా కొన్ని రోజులకు చిరంజీవి కొరటాల శివ పై చేసిన కామెంట్లు అడుగున పడిపోయాయి. ఇదిలా ఉంటె చిరంజీవి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆచార్య సినిమా డిజాస్టర్ గా మారడానికి పూర్తి బాధ్యత కొరటాల శివ మీద వేశారు.

ఈ విషయం గమనించిన కొందరు నెటిజన్లు కొరటాల శివ ను మళ్లీ చిరంజీవి బలి చేస్తున్నాడు. కొరటాల శివ అంటే చిరంజీవికి ఎందుకు అంత పగ అని అనుకుంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివ పై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు టాప్ ట్రేండింగ్ లో ఉన్నాయి. కానీ చిరంజీవి మాత్రం కొరటాల శివ అంటే తనకూ ఇష్టమని చాలా సార్లు ప్రస్తావించాడు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -