Chiranjeevi Vs Balakrishna: చిరంజీవి, బాలయ్యలలో బాగా నటించింది అతనేనా?

Chiranjeevi Vs Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. చిరంజీవి స్వయం కృషి, పట్టుదలతో మెగాస్టార్ గా ఎదిగారు. బాలకృష్ణ చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి తండ్రి తగ్గ తనయుడిగా, బాలయ్యగా రాణిస్తున్నారు. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఎనర్జిటిక్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నారు.

 

సినిమాల పరంగానే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ అటు చిరు, ఇటు బాలయ్య ఇద్దరూ ముందు వరుసలో ఉంటున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ బసవతారకం ఆస్పత్రి నిర్వహణ చూసుకుంటున్నారు. వీలైనప్పుడల్లా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

 

మరోవైపు రాజకీయాల్లోనూ ఇద్దరూ రాణించారు. చిరంజీవి సొంతంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి పలువురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. తర్వాతి పరిణామాలతో ఆయన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. బాలయ్య మాత్రం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. హిందూపురం అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కమర్షియల్ గానూ ఇద్దరు హీరోలూ రాణిస్తున్నారు. పలు షోలలో పాల్గొంటున్నారు. బాలయ్య అన్ స్టాపబుల్ షో నిర్వహిస్తుండగా, గతంలో చిరు మీలో ఎవరు కోటీశ్వరుడునే ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరించారు.

 

ఎవరు బెస్ట్ గా చేశారంటే..
తాజాగా హౌసింగ్ వెంచర్స్ కు సంబంధించిన యాడ్ లో చిరు, బాలయ్య వేర్వేరుగా నటించారు. కాన్సెప్ట్ ఒక్కటే అయినప్పటికీ ఇవి వేర్వేరు వెంచర్లు. తొలుత చిరంజీవి, కుష్బూ కలిసి శుభగృహ తరఫున యాడ్ లో నటించారు. తర్వాత ఇప్పుడు బాలయ్య సాయిప్రియ కన్ స్ట్రక్షన్స్ తరఫున యాడ్ లో నటించారు. రెండూ సొంతింటి కలకు సంబంధించిన ప్రకటనలు కావడం విశేషం. ఇందులో ఎవరు బాగా చేశారనే టాక్ ఇప్పుడు నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

TTD’s Pink Diamond: పింక్ డైమండ్ ఎక్కడ జగన్.. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా?

TTD's Pink Diamond: జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అధికారంలోకి రావడం కోసం ఎన్నో నాటకాలను కూడా వేశారు అందులో భాగంగా కోడి కత్తి కావడం వైయస్ వివేక హత్య కావడం వంటివి...
- Advertisement -
- Advertisement -