Chiranjeevi vs Nagarjuna: చిరంజీవికి చుక్కలు చూపిస్తున్న నాగార్జున.. నైజాంలో పైచేయి సాధిస్తారా?

Chiranjeevi vs Nagarjuna: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి అతని నటన గురించి పెద్దగా పరిచయంకర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో 150 సినిమాలకు పైగా నటించి నటనలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక చిరంజీవి అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా సినిమా అవకాశాలు అందుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా హడావిడి చేస్తున్నాడు చిరంజీవి.

ఇక ఈ దసరా కానుకగా చిరు గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. కాగా ఈ సినిమా ప్రమోషన్ నేపథ్యంలో చిరు బిజీగా ఉన్నాడు. ఇక ఆగ్రస్టార్ హీరో నాగార్జున గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. దాదాపు ఆరు పదుల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని అందం నాగార్జున సొంతం. ప్రస్తుతం నాగార్జున కూడా యువ హీరోలతో సమానంగా సినిమా ఆఫర్లు అందుకుంటూ కెరీర్ పరంగా మరింత ముందుకు దూసుకు వెళ్తున్నాడు.

కాగా ఈ దసరా సందర్భంగా ది గోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాగ్. అయితే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకు నాగార్జున ది గోస్ట్ సినిమా మంచి గట్టి ఇస్తుందని టాలీవుడ్ ప్రేక్షకులు అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే నాగార్జున ది గోస్ట్ సినిమా విషయంలో చిరంజీవి మీద పై చేయిగా ఉన్నట్లు తెలుస్తుంది. అదేమిటంటే నైజాంలో గాడ్ ఫాదర్ సినిమా కంటే ది గోస్ట్ సినిమాకే మంచి థియేటర్లు దక్కుతాయని ఇండస్ట్రీ సమాచారాల ద్వారా తెలుస్తుంది.

అంతేకాకుండా దీనంతటికీ కారణం ది గోస్ట్ సినిమా నిర్మాత అని తెలుస్తుంది. కాగా ది గోస్ట్ సినిమా హిట్ టాక్ వస్తే నాగార్జున చిరు మీద పై చేయి సాధించే అవకాశం ఉందని కొందరు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా నైజాం థియేటర్ల విషయంలో మాత్రం నాగ్ చిరంజీవికి చుక్కలు చూపిస్తాడని నాగ్ అభిమానులు అనుకుంటున్నారు. మరి దసరాకు బరిలోకి దిగుతున్న ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాయో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -