Chiranjeevi: చిరు రాజకీయాలకు పనికిరాడన్న వాల్తేరు వీరయ్య డైరెక్టర్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. అయితే ఈ సినిమా ఈవెంట్ సందర్భంగా దర్శకుడు బాబీ షాకింగ్ మాట అన్నారు. చిరు రాజకీయాల గురించి మాట్లాడుతూ బాబీ చేసిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవితో తాను సినిమా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నారని, ఆ సమయంలో కుదరకపోవచ్చని అనుకున్నట్లు తెలిపారు.

 

 

చిరు సినిమా సెట్ లో ఉండగా తానొక రోజు ఒక విషయం అడిగానని, అందుకు మెగాస్టార్ చెప్పిన సమాధానం తన మనసును మార్చేసిందని బాబీ తెలిపారు. ఎంత మంది ఎన్నో మాటలు అంటున్నా, రాజకీయాలలో ఏవేవో విమర్శలు చేస్తున్నా, వాటిని భరిస్తూ అలా ఉండటం ఎందుకని మెగాస్టార్ చిరంజీవిని తాను అడిగానని డైరెక్టర్ బాబీ తెలిపారు.

 

చిరు అందుకు బదులిస్తూ..ఇదిగో బాబీ, నన్ను తిట్టేవారికి, విమర్శించేవారికి ఇంట్లో అక్కచెల్లెల్లు, భార్యబిడ్డలు ఉంటారు. తిరిగి తాను ఏదైనా మాట్లాడితే వారు చాలా బాధపడతారు. అందుకే నేను వారిని ఏమీ అనలేను అని మెగాస్టార్ సమాధానం చెప్పినట్లు బాబీ తెలిపారు. నిజంగా చిరుకు రాజకీయాలంటే సరిపోవని, వాటిని చూడాలంటే ఎదురుతిరిగి వారిని కట్టడి చేసే మాటలు చిరు నోటి నుంచి రావని, చిరు ఒక సున్నిత మనస్కుడని బాబీ తెలిపారు.

 

రాజకీయాలలో చిరును విమర్శించేవారికి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నారని, ఆయన ఒక్కడు చాలు అందరికీ బుద్దిచెబుతాడని బాబీ అన్నారు. దర్శకుడు బాబీ అలా అనడంతో వేదిక ముందు ఉన్న చాలా మంది జోరున ఊలలు, కేకలు వేశారు. పవర్ స్టార్ పేరు వినపడగానే అందరూ రెట్టింపు ఉత్సాహంతో గోల గోల చేశారు. ఈవెంట్ కు అదే హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం దర్శకుడు బాబీ చిరు రాజకీయాల గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -