Chiranjeevi: చిరంజీవిని అప్పుడు తండ్రి కాపాడితే ఇప్పుడు కొడుకు కాపాడారా.. ఏమైందంటే?

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత హిట్లు ఫ్లాపులు రావడం సర్వసాధారణం.అయితే వరుసగా ఫ్లాప్ సినిమాలు ఎదురైతే హీరో లేదా హీరోయిన్లకు సినీ కెరియర్ ముగుస్తుంది అనే విషయం మనకు తెలిసిందే.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి కెరియర్ కూడా ఒకానొక సమయంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. వరుస ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్న చిరంజీవికి నిర్మాతలలో ఒకరైన ఎడిటర్ మోహన్ మలయాళంలో హిట్ అయిన హిట్లర్ సినిమా హక్కులను కొనుగోలు చేసి చిరంజీవికి హిట్ సినిమాని అందించారు.

ఇలా మోహన్ హిట్లర్ సినిమాతో మంచి హిట్ ఇవ్వడంతో తిరిగి చిరంజీవి ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా మారిపోయారు.అయితే రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తిరిగి అలాంటి వరుస ప్లాప్ సినిమాని ఎదుర్కొన్న సమయంలో ఎడిటర్ మోహన్ కుమారుడు మోహన్ రాజా తిరిగి గాడ్ ఫాదర్ సినిమా రూపంలో చిరంజీవికి హిట్ ఇచ్చారు.

అప్పుడు తండ్రి మలయాళ రీమేక్ హిట్లర్ సినిమాని చిరంజీవికి ఇచ్చి హిట్ ఇవ్వగా ఇప్పుడు తనయుడు మోహన్ రాజా మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ సినిమాని గాడ్ ఫాదర్ చిత్రంగా తెరకెక్కించి చిరంజీవికి మరొక హిట్ అందించారు. ఇలా అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు చిరంజీవి కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చారని చెప్పాలి. విజయదశమి సందర్భంగా విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

YS Jagan: జగన్ తప్ప ఎవరూ కష్టపడటం లేదా? అందుకే ఇలాంటి ఫలితాలా?

YS Jagan: రాజకీయాల తీరే వేరుగా ఉంటుంది. ఎప్పుడు ఏ నాయకుడు ఆకాశానికి ఎగురుతాడో, ఏ నాయకుడు పడిపోతాడో అస్సలు లెక్క గట్టలేం. ఇదంతా ప్రజల దీవెనల మీద ఆధారపడి ఉంటుంది. సరిగ్గా...
- Advertisement -