God Father: చిరు “గాడ్ ఫాదర్” ఓటీటీ విడుదల అప్పుడేనా…?

God Father: మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ముందు రిలీజైన ట్రైలర్ మరియు డైలాగ్లు ఈ చిత్రం పై భారీ అంచనాలను పెంచేశాయి. పైగా ప్రీ రెలీజ్ ఈవెంట్ కు కూడా భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చి ఈవెంట్ ని విజయవంతం చేసారు. చిరంజీవి స్పీచ్ తో ఫాన్స్ రోమాలు నిక్కపుడుచుకునేలా చేసాడు. ఇక ఈ సినిమాకి హనుమాన్ జంక్షన్ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. అయితే చిరు మూవీ సెలక్షన్స్ మరియు డైరెక్టర్ సెలెక్షన్స్ పై అభిమానులు కొంచం అసంతృప్తితో ఉన్న మాట నిజమే.

అయితే వాటన్నిటికి ఈ సినిమా ఉందా లేదా అనే దానికి సమాధానం దొరికింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటీవ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆచార్య సినిమాతో కొంత నిరాశ చెందిన అభిమానులకి ఈ చిత్రం కొంత సంతృప్తినిచ్చిందనే చెప్పాలి. మరో విషయం ఏమిటంటే సినిమా అభిమానులని అలరించినా కానీ కలెక్షన్ల పరంగా మునుపటి సినిమాలతో పోలిస్తే తక్కువగా వచ్చినట్టు సమాచారం.

అయితే ఏది ఎలా ఉన్నా ఇప్పుడు ఓటీటీ కాలం నడుస్తుందనేది వాస్తవం. సినిమా విడుదలై ఒక రోజే అయినా అప్పుడే ఓటీటీ రిలీజ్ ఎప్పుడనే దానిపై అప్పుడే చర్చ మొదలైంది. అయితే ఈ సినిమా హక్కులని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందని సమాచారం. ఓటీటీ విడుదల గురించి చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే.

అయితే టాలీవుడ్ పెద్దలు అందరు సినిమాల ఓటీటీ విడుదలపై ఒక నిర్ణయానికి వచ్చారు. సినిమా విడుదల అయిన తర్వాత 8 వారాలకు విడుదల కావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీన్ని బట్టి చూసుకుంటే గాడ్ ఫాదర్ చిత్రం డిసెంబర్ మొదటి వారంలో విడుదల కానున్నది. ఇక ఓటీటీ లో చూడాలనుకునే అభిమానులు డిసెంబర్ మొదటి వారం వరకు ఆగాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -