GodFather Movie: ‘గాడ్ ఫాదర్’కు హిట్ టాక్ వచ్చినా కానీ భయంభయంగానే?!!

GodFather Movie: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి సినిమా అంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు అవ్వాల్సిందే. అయితే చిరంజీవి ట్రాక్ గత కొంతకాలంగా డల్ గా ఉన్న నేపథ్యంలో ‘గాడ్ ఫాదర్’ హిట్ కావాలని మెగా అభిమానులు కోరుకున్నారు. మలయాళంలో వచ్చిన ‘లూసీఫర్’కి రీమేక్ గా వచ్చిన ‘గాడ్ ఫాదర్’కు తెలుగులో హిట్ టాక్ వచ్చింది.

మరోసారి మెగాస్టార్ చిరంజీవి హిట్ కొట్టారని, మెగా అభిమానుల కల తీరిందనే టాక్ వచ్చింది. మొదటి రోజే సినిమాకు హిట్ టాక్ రావడంతో అందరూ సంతోషించారు. అయితే సినిమాకు హిట్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం గుబులు మొదలైంది. మొదటి రోజు తర్వాత నుండి వస్తున్న కలెక్షన్లను చూసిన డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు.

గాడ్ ఫాదర్ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. దాంతో రెండో రోజు సినిమా కలెక్షన్లు బాగా ఉంటాయని అందరూ భావించారు. కానీ రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 8కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. రెండు రోజుల్లో కేవలం 28కోట్ల షేర్ మాత్రమే రాగా.. 92కోట్లు ఎప్పుడు వసూల్ అవుతాయనే భయం డిస్ట్రిబ్యూటర్లకు పట్టుకుంది.

పండగ వేళ వరుసగా 5 రోజులు సెలవులు ఉన్నాయి. సెలవులు కాబట్టి రోజుకు 10 కోట్ల వసూళ్లను రాబట్టినా కానీ వచ్చేది 60 కోట్ల షేర్ మాత్రమే. ఇలా చూసినా ఇంకా 30 కోట్లు వెనకబడే ఉంటుంది. దీంతో ఈ సినిమా సేఫ్ జోన్ లో ఉండాలంటే ఏదో అద్భుతం జరగాలని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరోపక్క చిరంజీవి మార్కెట్ తగ్గిపోయిందనే అనుమానాలను ఇండస్ట్రీలోని కొందరు లేవనెత్తుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Revanth Reddy Challenges KTR: నువ్వు మొగోడివైతే ఒక్క సీటైనా గెలిచి చూపించు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

CM Revanth Reddy Challenges KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జన జాతర పేరిట నిర్వహించినటువంటి...
- Advertisement -
- Advertisement -