Chiranjeevi: వైరల్ అవుతున్న చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

Chiranjeevi: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ పవన్ కళ్యాణ్ తమ్ముడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. చిరుకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. తమ్ముడు పై ఉన్న ప్రేమను చిరంజీవి చాలా సందర్భాలలో బయటపెట్టారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన తమ్ముడు కాదని తన కొడుకు లాంటివాడు అని ఎన్నోసార్లు చెప్పకొచ్చాడు. పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాలలో చిరంజీవి తనకు తండ్రి లాంటి వారిని ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పుకొచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. ఇక వ్యక్తిత్వంలో పవన్ ఎంతో మందికి ఆదర్శం అనేది అందరికీ తెలిసిందే. అయితే తమ్ముడు అంటే తన ప్రాణం అని చెప్పిన చిరంజీవికి పవన్ కల్యాణ్‌ కూడా ఒక్క విషయంలో తనకు అస్సలు నచ్చడని చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చాడు. పవన్ కల్యాన్‌ సాయం చేసే విషయంలో అస్సలు వెనక్కురాడు. తనకు లేకపోయినా సరే ఇతరులకు సాయం చేసే గుణం అతనిది. కొన్ని సార్లు తన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా ఉన్నదంతా ఇచ్చేస్తుంటాడు. అది నాకు అస్సలు నచ్చదు.

 

తన గురించి చూసుకున్న తర్వాత ఇతరులకు ఇస్తే బాగుంటుందని ఎన్నోసార్లు చెప్పాను. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన వద్దకు సాయం కోసం వస్తే తన గురించి ఆలోచించకుండా ఇస్తుంటాడు. అందుకే ఆయన్ను అంతమంది అభిమానిస్తున్నారు. పవన్ కోరుకున్న స్థానంలో ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నాను అంటూ తెలిపాడు చిరంజీవి. ఇకపోతే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి..

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -