Chiru Fans: వాల్తేరు వీరయ్య ఫస్ట్ రివ్యూ ఇదే.. సినిమా అలా ఉంటుందంటూ?

Chiru Fans: సంక్రాంతికి విడుదల కాబోతున్న మెగా మూవీ వాల్తేర్ వీరయ్య గురించి ఇప్పటికే ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి విడుదలైన లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుతం నెట్లో వైరల్ అయింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి మాస్ మసాలా మూవీ తో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆచార్య మరియు గాడ్ ఫాదర్ మిగిల్చిన నిరాశను వాల్తేర్ వీరయ్య పూర్తి చేస్తుంది అని చిరు అభిమానులు ఆశిస్తున్నారు.

వాల్తేర్ వీరయ్య మూవీలో చిరంజీవితో పాటు రవితేజ కూడా నటించడం తో ఈ మూవీలో మాస్ యాంగిల్ విపరీతంగా ఉంటుంది అని తెలుస్తుంది. అటు చిరు డైలాగ్ డెలివరీ లో దిట్ట, ఇటు రవితేజ కామెడీ యాంగిల్ లో కేక ,పైగా ఇద్దరు మాస్ మహారాజులే, మరి ఇద్దరి కాంబోలో అటు మాస్ యాంగిల్ ఇటు కామెడీ యాంగిల్ ఏ రకంగా ఉంటుందో అని ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.అయితే ప్రస్తుతం ఈ చిత్రంలో నటించిన ఓ నటుడు ఈ మూవీ గురించి మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. వాల్తేరు వీరయ్య చిరు అభిమానులకు సంతృప్తికరమైన విందు భోజనంలా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. షడ్రుచులతో నవరసాలు పండించి మరి సినిమాను జనాలకు చిరు వడ్డించబోతున్నాడని అర్థమవుతుంది.

ఈ మూవీలో చిరంజీవి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే ప్రతి అంశం ఉందని ఆయన చెప్పారు. మొదటినుంచి చిరంజీవి సినిమా అంటేనే ఫైట్లకు, డాన్సులకు ఫేమస్ అని చెప్పొచ్చు. మరి అదే తరహాలో కిర్రాక్ ఫైట్లతో ,గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలతో, క్రేజీ రొమాంటిక్ లిప్ లాక్ సీన్లతో ఈ మూవీ సంక్రాంతి బంపర్ కానుకగా అభిమానుల ముందుకు రానుందని ఆయన వెల్లడించారు.

ఇప్పటివరకు ఈ మూవీ తరఫునుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ మూవీలో ఎంత మసాలా ఉందో చెప్పకనే చెబుతున్నాయి. చిరంజీవి మాస్ గెటప్, ఇటు రవితేజ డైనమిక్ లుక్స్ ఈ మూవీపై హైప్ ను పెంచాయి. కానీ ఇదే సంక్రాంతికి సందడి చేయడానికి అటు బాలయ్య వీరసింహారెడ్డి కూడా బరిలోకి దిగడానికి రెడీగా ఉంది. మరి ఇద్దరి వీరుల్లో పోటీని ఎవరు తట్టుకుంటారో వెయిట్ చేసి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -