Rajamouli: రాజమౌళికి ఆయన భార్యకు మధ్య గొడవలు.. ఏమైందంటే?

Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీకి దొరికిన వజ్రం ‘రాజమౌళి’. అప్పటివరకు టాలీవుడ్ అంటే కాస్త చిన్న చూపు ఉండేది. కానీ రాజమౌళి ఎంట్రీ ఇచ్చాక టాలీవుడ్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి వ్యాప్తి చేశారు. అప్పట్లో డైరెక్టర్లను కేవలం డైరెక్టర్లుగా మాత్రమే చూసేవారు. స్టార్ హీరోలు కూడా పెద్దగా విలువ ఇచ్చేవారు కాదు. ఒక వేళ సినిమా హిట్ అయితే.. ఆ క్రెడిట్ అంతా హీరోల ఖాతాలో పడేది. సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ మీద తోసేసేవారు. కానీ రాజమౌళితో ఇండస్ట్రీలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. సినిమా, స్టోరీ సెలక్షన్‌లో మార్పలు జరిగాయి. టెక్నీషియన్లు ఎక్కువయ్యారు. గ్రాఫిక్ డిజైనింగ్ వాడకం పెరిగింది. అయితే అప్పట్లో సినిమా తీసినా.. ప్రమోషన్‌ను పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ రాజమౌళి సినిమాలను ప్రమోట్ చేయడం చూసి.. నలుగురు ఆయన బాట వెంట నడవడం మొదలు పెట్టారు. ప్రమోషన్స్ కోసం కోట్లల్లో ఖర్చు పెడుతున్నారు.

 

 

‘బహుబలి, ఆర్ఆర్ఆర్’ సినిమాల తర్వాత రాజమౌళి రేంజ్ పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోలు సైతం ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతో ఎదురు చూస్తున్నారు. రాజమౌళి చేతిలో పడితే ఆ హీరో పాన్ ఇండియా స్టార్ అవ్వడం కన్‌ఫర్మ్ అని ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరూ బలంగా నమ్ముతున్నారు. అయితే రాజమౌళి చేతిలో ఇరుక్కున్న హీరోకు మాత్రం చుక్కలే కనిపిస్తాయట. ఇప్పటికే ఆయన డైరెక్షన్‌లో సినిమాలు చేసిన హీరోలు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. సినిమా సన్నివేశాల విషయంలో చాలా పర్‌ఫెక్ట్ గా ఉండాలనుకునే రాజమౌళి.. రియల్ లైఫ్‌లోనూ అలాగే ఉంటారట. రాజమౌళికి క్లీనింగ్ పిచ్చి ఎక్కువగా ఉంటుందట. తన చుట్టూ ఉండే పరిసరాలను ఎంతో శుభ్రంగా ఉంచుకుంటారట. అలాగే తన పనులను తానే చేసుకుంటాడని సమాచారం. రూమ్‌లో ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడే ఉండేలా చూసుకుంటారట. ఒకవేళ వేరే చోట ఉంటే చాలా కోపగించుకుంటారట. ఈ విషయంలో రాజమౌళి భార్య రమాదేవితో కూడా చాలా సార్లు గొడవలు జరిగాయట. ఈ విషయాన్ని స్టార్ హీరోలు రామ్ చరణ్, తారక్‌లు కూడా చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో.. రాజమౌళిని భరించడం చాలా కష్టమని అన్నారు. సీన్ లేదా డ్యాన్స్ స్టెప్పుల కోసం చాలా టార్చర్ పెట్టేవాడని, ప్రతీ చిన్న విషయాన్ని పట్టించుకుంటారని పేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -