Husband: భర్త నోటి నుంచి మరో అమ్మాయి పేరు వస్తే.. ఏం చేయాలో తెలుసా?

Husband: సాధారణంగా భార్య భర్తలంటే చిన్న చిన్న మనస్పర్ధలు, వివాదాలు తలెత్తడం కామనే. అయితే.. కొన్ని సార్లు వాళ్లకు వచ్చే అనుమానాలతో సంసారాలు కూలిపోతుంటాయి. భర్త పని ఒత్తిడో లేక కుటుంబ పోషణ భారమో.. ఇతరాత్ర కారణాలతో భార్య, కుటుంబానికి టైం ఇవ్వకపోవడంతో భార్యలు వారిపై అనుమానాలు పెంచుకోవడం ప్రారంభిస్తారు. అలాంటి సమయంలో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తి విడాకులకు వరకు దారి తీస్తోంది. పొరపాటున భర్త నోటి నుంచి ఇంకో అమ్మాయి పేరుగాని.. ఆఫీస్‌లో పనిచేసే కొలిగ్‌ పేరు వస్తే మామ్మల్ని పట్టించుకోవడం మానేశారని ఇతరులతో చెప్పుకోవడం ప్రారంభిస్తారు.

 

అయితే అలాంటి వారు మనస్సును ప్రశాంతంగా ఉంచి అతడి గురించి పూర్తిగా తెలుసుకోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.అలాంటి అనుమానాలు ఉన్న వారు రెండు రకాల సమస్యలతో బాధపడుతున్నట్లట.  కుటుంబం గురించి తన భర్త, అంతగా పట్టించుకోకపోవడం, ఆఫీస్‌లో కానీ.. మయట కానీ ఇంకో అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని బలమైన అనుమానాన్ని నాటకుంటారని నిపుణులు సూచిస్తున్నారు.  అయితే ఇలాంటి అనుమానాలు ఉన్నప్పుడు దాని గురించి ఆరా తీయడం వృథా అంట. ఇలాంటి విషయంపై నేరుగా భర్తతో అడకకుండా ఇంటి పెద్దవాళ్లతో కలిసి చర్చించాలి.

 

అప్పుడు కూడా అసలు విషయం తెల్వకుంటే గతంలో ఎలా ఉన్నారు.. ఇప్పుడెందుకు ఇలా ఉంటున్నారని భర్తతలో క్షుణ్నంగా చర్చించాలి. భార్య భర్తను అడిగే ‍ ప్రశ్నలో కూడా తాను నిజం చెప్పేలా అంత సున్నితంగా ఉండాలి. ఒకవేళ భర్త నిజంగా తప్పు చేస్తున్నాడని బలమైన కారణాలు ఉంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నేరుగా అతడు పని చేసే చోటుకెళ్లి ఆరా తీయాలి. అతను కరెక్ట్‌గా ఉండి పని ప్రెజర్‌తో మీతో గడిపే టైం ఇవ్వలేదని అనుమానాలు పెంచుకుని అతడితో వాగ్వాదానికి దిగితే మాత్రం ఇద్దరు నష్టపోతారు. పిల్లల భవిష్యత్‌ ఛిన్నభిన్నం అవుతోం‍దని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -