Clone Whatsapp: ఆ రెండు వాట్సాప్‌లు వాడుతున్నారా! తస్మాత్‌ జాగ్రత్త!

Clone Whatsapp: ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు పెరగడంతో మనం ఎలాంటి సమాచారం ఇవ్వకున్నా మన ఫోన్‌ డాటా మొత్తం వాళ్ల దగ్గర నిక్షిప్తమవుతోంది. క్లోన్‌ వాట్సాప్, జీబీ వాట్సాప్‌ వాడే వారు చాలా ప్రమాదంలో ఉన్నారని ఎసెట్‌ అనే సంస్థ ఒక రిపోర్టులో పేర్కొంది. అది కూడా భారతదేశ యూజర్లే ఈ ప్రమాదంలో ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ రెండు వాట్సాప్‌ డేటాను లీక్‌ చేసే అవకాశం ఉందని, మనకు తెలియకుండానే మెసేజ్‌లు చదువుతున్నారని, వాట్సాప్‌ను హ్యాక్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. గూగుల్‌ ప్లే స్టోర్‌ లేని ఈ వాట్సాప్‌లు యాంటీ–వైరస్‌ ధాటికి సులువుగా గురవుతున్నాయని, వైరస్‌ నుంచి జాగ్రత్త పడాలంటీ క్లోన్‌ వాట్సాప్, బీజీ వాట్సాప్‌ తొలగించడమే మంచిదని హెచ్చరిస్తున్నారు.

క్లోన్‌ వాట్సాప్, జీబీ వాట్సాప్‌లలో సెక్యూరిటీ సరిగా ఉండదని, స్పైవేర్‌ వంటి హానికరమైన వైరస్‌లను అడ్డుకునే సామర్థ్యం ఉన్న సాఫ్టేవేర్‌ ఇందులో ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే అనధికారిక వాట్సాప్‌ క్లోన్‌ యాప్‌ల నిషేధంపై మెటా సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ, వాటిని పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతోంది. ఇలాంటి యాప్‌ ద్వారా వాట్సాప్‌ వాడితే వారి అకౌంట్‌ను పూర్తిగా నిలివేస్తామని మెటా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

భారత దేశంలో ఆండ్రాయిడ్‌ యూజర్లు ఎక్కువగా ఉంటారు. ఆండ్రాయిడ్‌ ఆధారిత క్లోన్‌ వాట్సాప్, జీబీ వాట్సాప్‌ లు ఇంటర్నెట్‌లో వందల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ ట్రోజన్స్‌ కూడా ఇండియాలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాస్తవానికి ట్రోజన్లు చట్టపరమైనవి కావు. కానీ అవి చట్టబద్ధమైనవన్నట్లుగా నెటిజెన్లకు అందుబాటులో ఉన్నాయి. దీంతో అసలు విషయం తెలియక నెటిజన్లు వీటిని ఉపయోగించి, స్పైవేర్‌ బారిన పడుతున్నారు. ఈ ఏడాది ఆండ్రాయిడ్‌ థ్రెట్‌ ఇండియాలో 9.5 శాతానికి పెరిగింది. కాబట్టి గూగుల్‌ ప్లేలో ఉన్న యాప్‌లనే ఉపయోగించి స్పైవేర్‌ నుంచి రక్షణ పొందమని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -