CM KCR-Rajasingh: సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై రాజాసింగ్ ఫైర్

CM KCR-Rajasingh: సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. తనకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంటే పాడైపోయిన బుల్లెట్ ఫ్రూప్ వెహికల్ కేటాయిస్తారా అంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. మత ప్రవక్తను కించపరుస్తూ మాట్లాడటంతో రాజాసింగ్ కు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాయి. దీంతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాజాసింగ్ కు బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్ కేటాయించింది.

 

కానీ ఆ బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్ ప్రతీసారి చెడిపోతుందని, మధ్యలో ఎక్కడపడితే అక్కడ ఆగిపోతుందంటూ తెలిపారు. చాలాసార్లు మధ్యలో ఆగిపోవడంతో వేరే కారులో వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. 4 నెలల క్రితం రోడ్డు మధ్యలోనే బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం ఆగిపోయిందని, దీంతో ఇంటెలిజెన్స్ ఆఫీస్ కు పంపించినట్లు తెలిపారు. మళ్లీ అదే పాత వాహనాన్ని రిపేర్ చేసి పంపారని, 2 నెలల క్రితం నాంపల్లి కోర్టుకు వెళ్లే సమయంలో మళ్లీ మధ్యలోనే ఆగిపోయిందని, దాంతో ఆటోలో వెళ్లాల్సి వచ్చిందన్నారు.

 

అఘ్ఝల్ గంజల్ వద్ద మరోసారి బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్ ఆగిపోయిందని, ఆ సమయంలో సొంత వాహనాన్ని రప్పించుకుని వెళ్లాల్సి వచ్చిందని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న తనకు ఇంటెలిజెన్స్ అధికారులు ఇలాంటి వాహనం ఇస్తారా అంటూ రాజాసింగ్ మండిపడ్డారు. కండీషన్ లో లేని వాహనంతో తనకు భద్రత ఉండదని, అధికారులు ఇప్పటికైనా స్పందించి మంచి వాహనం కేటాయించాలని కోరారు. కాగా పీడీ యాక్ట్ కేసులో కొద్దిరోజుల పాటు రాజాసింగ్ చర్లపల్లి జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్ పై బయటకొచ్చారు. కొన్ని షరతులతో హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. మీడియాతో మాట్లాడవొద్దని సూచించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో...
- Advertisement -
- Advertisement -