CM Jagan: రైతులను సీఎం జగన్ కూడా మోసం చేస్తున్నారా.. ఏం జరిగిందంటే?

CM Jagan: జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఉంటుందని ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే సచివాలయ ఉద్యోగులను నియమించిన తర్వాత జాబ్ క్యాలెండర్ గురించి జగన్ సర్కార్ పూర్తిగా మర్చిపోయారనే తెలుస్తుంది. ఇలా జాబ్ క్యాలెండర్ మర్చిపోయిన సంక్షేమ పథకాల క్యాలెండర్ మాత్రం అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నప్పటికీ ఇలా సంక్షేమ పథకాలను అందించడంలో కూడా జగన్ లెక్క తప్పిందని తెలుస్తోంది.

దేశానికే వెన్నెముకగా ఉన్నటువంటి రైతులకు ఈయన ఆసరాగా రైతు భరోసాను ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ రైతు భరోసా డబ్బులను మూడు విడుదలగా ఏడాదిలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు అయితే మే నెలలోనే 12,500 ప్రకటిస్తామని మొదట్లో చెప్పిన సర్కార్ చివరికి 7500 మాత్రమే ప్రకటిస్తోంది. మే నెలలో రైతు భరోసా డబ్బులు చెల్లించాల్సి ఉండగా రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో ఈ రైతు భరోసా డబ్బులను వేయడంలో కూడా ఆలసత్వం వహిస్తోంది.

 

మే 30వ తేదీ కర్నూలులో రైతు భరోసా నిధులు మంజూరు చేయడానికి ఏర్పాటు చేసే సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి కానీ చివరి క్షణంలో ఈ కార్యక్రమం కాస్త వాయిదా పడింది. ఇలా ఈ కార్యక్రమం వాయిదా పడడానికి కారణం నిధులు లేకపోవడమేనని తెలుస్తుంది. దీంతో ఈ కార్యక్రమాన్ని జూన్ నెలలోకి వాయిదా వేశారు. అయితే జూన్ నెలలో అమ్మఒడి డబ్బులు చెల్లించాల్సి ఉంది మరి ఈ అమ్మ ఒడి కూడా ఆలస్యం అవుతుందని తెలుస్తుంది.

 

ఇలా జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్నారని చెప్పాలి.ఇకపోతే రాష్ట్రంలో ఖజానా ఖాళీ కావడం ఏంటి అని కూడా మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితం కేంద్రం నుంచి జగన్ సర్కార్ సుమారు పదివేల కోట్ల రూపాయల వరకు నిధులు తీసుకువచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ డబ్బులు అన్ని ఎక్కడికి పోయాయి అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో డబ్బులు మంజూరు చేస్తున్నప్పటికీ జగన్ సర్కార్ మాత్రం సంక్షేమ ఫలాలను, అభివృద్ధి పథకాలను అలాగే ఉద్యోగులకు జీతాలను ఇవ్వడంలో ఆలస్యం చేయడం పట్ల పార్టీకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Vs Eswara Rao: పొలిటికల్ ట్విస్టులకు కేరాఫ్ ఆ నియోజకవర్గం.. ఆ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో?

Kiran Kumar Vs Eswara Rao: శ్రీకాకుళం జిల్లాకు గేట్ వేగా చెప్పే ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. నిజానికి ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ కాంట్రవర్సీకి పెట్టింది...
- Advertisement -
- Advertisement -