CM Jagan: ఉద్యోగులపై ఇదేం లాజిక్ జగన్ సార్.. మరీ ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారేంటి?

CM Jagan:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఈమధ్య ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో పాల్గొని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు కల్పనకు తోడ్పాటు అందించడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు అన్నట్లు మాట్లాడారు. ఒక ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించగలదు, ఒక పెద్ద కంపెనీ వస్తే ఎన్ని ఉద్యోగాలు వచ్చేస్తాయి అంటూ ఆర్థిక అభివృద్ధి అంతా స్వయం ఉపాధి లోనే ఉందని దీనివల్లే ఎకానమీ పెరుగుతుందని చెప్పారు. అలాంటి ఎకానమీలో రైతులు, చేతి వృత్తుల వాళ్ళు, ఇతర కార్మికులే కీలకంగా వ్యవహరిస్తున్నారని వాళ్లకు తోడ్పాటు అందిస్తే చాలు అని జగన్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

ఈ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగుతుంది. జగన్ అధికారంలోకి రాకముందు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటికి నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీలన్నీ భర్తీ చేసేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు సరి కదా ప్రభుత్వంలో విలీనం అయిన ఆర్టీసీ ఉద్యోగులను చూపించి లక్షల్లో ఉద్యోగాలు కల్పించినట్లు డబ్బా కొట్టుకుంటున్నారు.

పోనీ ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఈయన అధికారంలోకి వచ్చిన తరువాత ఆశించిన స్థాయిలో ఏపీకి పరిశ్రమలు రాకపోవడం గమనార్హం. అంతేకాకుండా రావాల్సిన పరిశ్రమలు కూడా వెనక్కి పంపేయడంతో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది. ఈ విషయంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఇప్పుడు జగన్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు విని మరింత ఆగ్రహానికి గురవుతున్నారు.

ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి ఉద్యోగాలను కల్పించవలసిన జగన్ అదేమంటే ముఖ్యమైన విషయం కాదు అన్నట్లు మాట్లాడటం తో ప్రజలు మండిపడుతున్నారు. జగన్ మీద ఆ మాత్రం, ఈ మాత్రం సానుభూతి ఉన్న ఓటర్లు కూడా ఈ ఇంటర్వ్యూ తో ఆయనకు పూర్తిగా వ్యతిరేకంగా మారినట్లు కనిపిస్తోంది. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే ఉన్న ఉద్యోగాలు కూడా ఉండవనే భావన అందరిలోనూ కనిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -