Munugode By-Poll: మునుగోడులో హుజూరాబాద్ సీన్ రిపీట్.. కేసీఆర్ లేఖస్త్రాలు

Munugode By-Poll: మునుగోడు ఉపఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీలన్నీ ఇక్కడ గెలుపు కోసం కృషి చేస్తున్నాయి. పార్టీల నేతలందరూ అక్కడే మకాం వేసి మునుగోడు ఉపఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ మండలాలు వారీగా ఇంచార్జ్ లను నియమించింది. తమ మండలాల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని, స్థానికల నేలను సమన్వయం చేసుకోవాలని అన్ని పార్టీలు ఇంచార్జ్ లకు ఆదేశాలు జారీ చేశాయి. ఇవాళే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

ఇక మిగతా పార్టీల నేతలు కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అధికార టీఆర్ఎస్ ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి ఎంపీటీసీ స్థానానికి ఒక ఎమ్మెల్యేను టీఆర్ఎస్ ఇంచార్జ్ గా ప్రకటించింది. ఇఫ్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మునుగోడులో తమకు కేటాయించిన గ్రామంలో రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటున్నారు. మంత్రి హరీష్, కేటీఆర్ తో పాటు కేసీఆర్ కూడా ఒక గ్రామానికి ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. మొత్తం టీఆర్ఎస్ నేతలందరినీ కేసీఆర్ ప్రచారంలోకి దించారంటే.. మునుగోడులో ఉపఎన్నికలను టీఆర్ఎస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతుంది.

అయితే మునుగోడుపై కేసీఆర్ ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ లో అనుసరించిన ఓ వ్యూహన్ని మునుగోడులోనూ అమలు చేయనున్నారనే చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు దళితబంధు అనే స్కీమ్ ను కేసీఆర్ ను తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ను హుజూరాబాద్ లోనే స్టార్ట్ చేశారు. కానీ కేసీఆర్ దళితబంధు స్కీమ్ హుజురాబాద్ లో వర్క్ అవుట్ అవ్వలేదు. దళితబంధు అమలు చేసినా టీఆర్ఎస్ ఓడిపోయింది. కానీ హుజూరాబాద్ ఎన్నికల సమయంలో దళితబంధు లబ్ధిదారులందరికీ కేసీఆర్ వ్యక్తిగతంగా లేఖ రాశారు. ఇప్పుడు అలాంటి వ్యూహన్నే మునుగోడులో కేసీఆర్ అమలు చేయనున్నారట.

మునుగోడులో ప్రభుత్వ పథకాల ద్వారా దాదాపు 3 లక్షలకుపై మంది లబ్ధి పొందుతున్నారు. ఆసరా పింఛన్లు, షాదీ ముబారక్, కల్యాణ్ లక్ష్మి, రైతుబంధు, రైతుబీమా లాంటి సంక్షేమ పథకాల ద్వారా చాలామంది లబ్ది పొందుతున్నారు. వీరిందరికీ కేసీఆర్ వ్యక్తిగతంగా లేఖలు రాయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. లబ్దిదారులందరికీ పేరుపేరున లేఖలు రాయాలని కేసీఆర్ నిర్ణయించారట. లబ్దిదారుని పేరుతో పాటు ప్రభుత్వం నుంచి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఎంత లబ్ది పొందాలనే వివరాలతో సహా లేఖ రాయనున్నాని తెలుస్తోంది. ఇక త్వరలో మునుగోడులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసందుకే కేసీఆర్ ప్లాన్ చేశారు. ఈ నెల 29లేదా 30వ తేదీన కేసీఆర్ బహిరంగ సభకు టీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -