CM KCR: ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

CM KCR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించినప్పుడల్లా ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం జరుగుతూనే ఉంది. కేసీఆర్ మాత్రం పలుమార్లు ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని క్లారిటీ ఇచ్చినా.. ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.

 

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్ధాయి సమావేశంలో ముందస్తు ఎన్నికలు ఉండవని నేతలకు కేసీఆర్ తెలిపారు. రేపటి నుంచే ఎమ్మెల్యేలంతా ప్రజల్లో ఉండాలని, బీజేపీపై ఇక యుద్దమేనంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ఇంకా పది నెలలు మాత్రమే సమయం ఉందని, నియోజకవర్గాలకు సమన్వయం చేసుకునేందుకు ఇంచార్జ్ లను నియమిస్తామని స్పష్టం చేశారు.

 

మునుగోడులో మెజార్టీ తగ్గడంపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. సరిగ్గా పనిచేయని మంత్రులకు క్లాస్ ఇచ్చారు. ఇక టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ గుడ్ న్యూస్ తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తానంటూ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లపై నిఘా ఉంటుందని, మీరు ఏం చేస్తున్నారో తనకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుందని తెలిపారు. బీజేపీ ప్రలోభాలకు తలొగ్గి మీ రాజకీయ కెరీర్ ను నాశనం చేసుకోవద్దని స్పష్టం చేశారు.

 

తన కూతురు కవితను కూడా బీజేపీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేశారని, దీనిని బట్టి చూస్తే బీజేపీ ఎంత బరి తెగించిందో అర్ధం అవుతుందన్నారు. సీబీఐ, ఐటీ దాడులకు భయపడవద్దని, అవి ఏమీ చేయలేవన్నారు.వారికి విచారణ సంస్థలు ఉంటే మనకు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. నేతలందరూ ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్దం కావాలని, బీఆర్ఎస్ ద్వారానే జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నామని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ నే గెలుస్తుందన్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -