CM KCR: ఎన్టీఆర్ బాటలో దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్.. తెరపైకి మళ్లీ ఆ నినాదం

CM KCR: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడించారు. జాతీయ రాజకీయాల్లోకి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫ్రంట్ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటి చె్ప్పారు. తెలుగు ప్రజలపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పెత్తనాన్ని వ్యతిరేకించారు. తెలుగు ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షపై పోరాడి విజయం సాధించారు. తెలుగువారి పేరును దేశం నలుమూలలా చాటి చెప్పారు.

ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళుతు్న్న కేసీఆర్ కడా అదే నినాదాన్ని తెరపైకి తెస్తున్నారు. ఎన్టీఆర్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం. ఆయనకు వీరాభిమాని. అందుకే తన కుమారుడు మంత్రి కేటీఆర్ కు కల్వకుంట్ల తారకరామారావు అనే పేరు పెట్టారు. అయితే ప్రస్తుతం కొత్త జాతీయ పార్టీ పెట్టే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. దీంతో ఓ ప్లెక్సీ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. నాడు ఎన్టీఆర్.. నేడు కేసీఆర్.. తెలుగోడి ఆత్మగౌరవం నిలుపు దేశకి నేత కేసీఆర్ అంటూ ఖానాపురం గ్రామ పంచాయతీలో ఓ ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటోంది.

అప్పుడు ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఢిల్లీ గడ్డపై పోరాడారని, ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాడుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలో సీనియర్ ఎన్టీఆర్ ఫొటో ఒకవైపు, కేసీఆర్ ఫొటో మరోవైపు ఉంది. త్వరలో కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ బాటలో కేసీఆర్ నడవబోతున్నారని, దేశ్ కీ నేతగా ఎదిగి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని చెబుతున్నారు.

అయితే టీఆర్ఎస్ నేతలు టీడీపీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో ఓ వైసీపీ కార్యకర్త నారా బ్రహ్మణీని దూషించాడు. నారా బ్రహ్మణిపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడిన టీఆర్ఎస్ నేతలు చితకబాదారు. ఇప్పటికే టీడీపీ నుంచి వెళ్లినవారికి టీఆర్ఎస్ లో కేసీఆర్ పెద్దపీట వేస్తు్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల ఓటర్లను ఆకట్టుకేనేందుకు టీఆర్ఎస్ అన్ని ప్రయత్ాల ుచేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -