CM KCR: తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ను గెలిపించి సీఎం కేసీఆర్ సీఎంగా అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. కేవలం కేసీఆర్ వ్యూహలతోనే గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందింది. అయితే ప్రస్తుతం సీఎం కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరుగతుందనే అంచనాలు తెలంగాణ రాజకీయాల్లో ఏర్పడ్డాయి. గత ఎన్నికల్లో రైతుబంధు పథకం బాగా వర్కౌట్ కావడంతో టీఆర్ఎస్ 100 సీట్లు గెలుచుకోగలిగింది. కానీ ఈ సారి అంతగా కొత్త పథకాలు ఏమీ లేవు. దళితబంధు పథకం తీసుకొచ్చినా.. అది దళితులకు మాత్రమే వర్తిస్తుంది. రైతుబంధు పథకం లాగా అన్ని సామాజికవర్గాలకు వర్తించే పథకం ఏదీ లేదు. దీంతో సామాజికవర్గాల వారీగా కేసీఆర్ పథకాలను ప్రవేశపెడుతున్నారు. దళితులకు దళితబంధు అమలు చేస్తుండగా.. త్వరలో గిరిజనులకు గిరిజన బంధు ప్రవేశపెడతానంటూ ఇటీవల కేసీఆర్ ప్రకటించారు.
దీంతో కేవలం సామాజికవర్గాల వారీగా సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు కేసీఆర్ ఇప్పటిుంచే వ్యహరచనలు చేస్తున్నారు. కానీ ఈ సారి ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ ను టీఆర్ఎస్ నియమించుకున్న విషయం తెలిసిందే. పీకే వ్యూహలతో ముందుకు వెళ్లాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ సోషల్ మీడియా పరంగా మరింత బలపడింది. సోషల్ మీడియాలో బీజేపీని వ్యతిరేకంగా పోస్టులు పెడుతోంది. ఇక పీకే టీం తెలంగాణలో ఎప్పటికప్పుడు సర్వేలు చేస్త కేసీఆర్ రిపోర్టుులు అందిస్తుంది.
కానీ గత కొంతకాలంగా పీకే టీం సర్వే పట్ల, పీకే పనితీరు పట్ల కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీని రాష్ట్రంలో ఎదుర్కొనేందుకు పీకే ఇచ్చే వ్యూహలు పేలవంగా ఉన్నాయని కేసీఆర్ బావిస్తున్నారట. ప్రశాంత్ కిషోర్ ఇచ్చే ప్లాన్ లు పనిచేయడం లేదని, బీజేపీ మరింత బలపడుతుందని కేసీఆర్ మదిలో ఉందట. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలలో ఒక్కటి కూడా తెలంగాణలో వర్కౌట్ అవ్వడం లేదట. అలాగే పీకే టీం సర్వేలు తన చేతికి రాకముందే సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుండటంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారట. ఇటీవల పీకే టీం సర్వే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందులో చాలామంది టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడైంది. టీఆర్ఎస్ కు యాంటీగా ఉన్న ఈ సర్వే రిపోర్టు సోషల్ మీడియా వైరల్ గా మారింది. సేమ్ టూ సేమ్ ఇదే సర్వే రిపోర్టు కేసీఆర్ చేతికి అందిందట. దీంతో ప్రశాంత్ కిషోర్ టీంపై కేసీఆర్ పైర్ అయ్యారట. ఇక నుంచి పీకే టీం సర్వేలను కేసీఆర్ పట్టించుకోవడం లేదట. ప్రశాంత్ కిషోర్ సేవలను కేవలం సోషల్ మీడియా పరంగా మాత్రమే ఉపయోగించుకోవాలని కేసీఆర్ నిర్ణయించారట. సర్వేలు ఇక వద్దని ప్రశాంత్ కిషోర్ కు కేసీఆర్ సూచించారట.
దీంతో ప్రశాంత్ కిషోర్ తన సర్వే బృందాలను ఏపీకి పంపించారట. 2024 ఎన్నికలకు ఏపీలో కూడా పీకే సర్వే పనిచేస్తుంది. అందుకే కేసీఆర్ వద్దని చెప్పడంతో పీకే టీం సర్వ ేబృందాలు అన్నీ ఏపీకి వెళ్లాయి. ఇక నుంచి తెలంగాణలో పీకే టీం సర్వేలు ఉండవని చెబుతున్నారు.