CM KCR-KA Paul: సీఎం కేసీఆర్‌పై సుప్రీంకోర్టు సీజేఐకు కేఏ పాల్‌ ఫిర్యాదు

CM KCR-KA Paul: మునుగోడు ఉపఎన్నిక ముగిసిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరు కొనసాగిస్తోన్నారు. అందులో భాగంగా తాజాగా కేసీఆర్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. స్వయంగా జస్టిస్ ఉచ్చల్ భూయాన్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై తెలంగాణలో రచ్చ జరుగుతోంది.

 

ఈ కేసులపై అనేక పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ కేసులో సిట్ విచారణను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇలాంటి తరుణంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కేసీఆర్ కలవడాన్ని కేఏ పాల్ తప్పుబడుతోన్నారు. దీనిపై సుప్రీంకోర్టు సీజేై డీ.వై చంద్రచూడ్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇలాంటి తరుణంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కేసీఆర్ కలిసి దాదాపు రెండు గంటల పాటు మాట్లాడాన్ని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు క్రమంలో ఇరువురి భేటీ వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు వెళుుతాయని సీజేఐ డి.జవై చంద్రచూడ్ కు ఫిర్యాదు చేశారు. అలాగే దీనిపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, న్యాయమంత్రిత్వశాఖకు కంప్లైంట్ చేశారు. యాక్ట్ నంబర్ 14 ప్రకారం ఇా భేటీ కావడం చట్టవిరుద్దమని కేఏ పాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సమయంలో కలవడం అసహజ పరిణామమని స్పష్టం చేశారు. కాగా తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం సంచలనం రేపుతోంది. ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -