CM KCR: బీజేపీని ఇరుకున పెట్టేలా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. టీఆర్ఎస్ ఉచ్చులో కాషాయం?

CM KCR: రాజకీయంగా ఎత్తులు, పై ఎత్తులు వేయంలో సీఎం కేసీఆర్ దిట్ట అని చెబుతూ ఉంటారు. రాజకీయంగా ఎలాంటి సమస్యను అయినా ఎదుర్కొవడంలో కేసీఆర్ చాణక్యుడు అని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. వ్యూహలు, ఎత్తుగడలో వేయడంలో కేసీఆర్ కు చాలి ఎవరూ లేదరి టీఆర్ఎస్ వర్గాలు చెబుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వ్యూహంలో మార్చుకుంటూ ముందుగా ఎజెండాను ఫిక్స్ చేసుకుంటారు కేసీఆర్. తన ఎజెండాలోనే మిగతా పార్టీలు వచ్చేలా చేసి చిక్కులు తెచ్చిపెడతారు.

ఇప్పడు బీజేపీ విషయంలో కేసీఆర్ కూడా అదే చేశారు. ముందుగా ప్లాన్ చేసుకుని బీజేపీకి కొత్త చిక్కులు తెచ్చి పెట్టారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ చక్రబంధంలో బీజేపీ చిక్కుకుంది. కేసీఆర్ ట్రాప్ లో చిక్కుకుని బీజేపీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన సెక్రటేరియట్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా గెజిట్ కూడా విడుదల చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టాలని సూచించారు.

ఇటీవల కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి మోదీ శంకుస్ధాపన చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం పనులు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇటీవల ప్రజాయుద్దనౌక గద్దర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలను కలిసి కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టేలా చేయాలని వినతిపత్రాలు అందజేశారు. దీనిపై మోదీ, అమిత్ షాలను కలిసేందుకు కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తెలంగాణలోని పార్టీలన్నీ కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.

దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తుంది. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు కేసీఆర్. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవనానికి అంబేద్కర పేరు పెట్టారు. దీని వల్ల బీజేపీని కేసీఆర్ ఇరుకున పెట్టినట్లు అయింది. తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి పంపిను కనుక దీనిపై పార్లమెంట్ లో చర్చ జరుగుతోంది. ఒకవేళ కొత్త భవనానికి అంబేడ్కర్ పేరు పెడతే ఆ క్రెడిట్ కేసీఆర్ కు దక్కుతుంది. కేసీఆర్ ఒత్తిడి వల్లే కేంద్రం పేరు పెట్టిందని టీఆర్ఎస్ నేతలకు గొప్పగా చెప్పుకుంటారు.

దీని వల్ల టీఆర్ఎస్ పార్టీకి లాభం జరుగుతుంది. ఒకవేళ అంబేద్కర్ పేరు పెట్టకపోయినా కూడా అది టీఆర్ఎస్ కే ప్లస్ అవుతుంది. అంబేద్కర్ పేరు పెట్టకపోతే దళితుల పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని, రాజ్యాంగం రచించిన అంబేద్కర్ పేరును పార్లమెంట్ కు పెట్టకపోవడం దారుణమని కేసీఆర్ విరుచుకుపడే అవకాశముంది. దీంతో ఎటూ చేసినా ఇది బీజేపీకి చిక్కులు తెచ్చే అంశమే. అందుకే కేసీఆర్ పక్కా వ్యూహంతో బీజేపీని ఇరుకున పెట్టాలని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు కేసీఆర్ ఉచ్చులో పడి బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతుంది.

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -